న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?

Umpire Langton Rusere makes a bizarre decision during New Zealand-India ODI

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆటపరంగా ఇరుజట్లు ఒకే విధంగా పోరాడినప్పటికీ విజయం మాత్రం కివీస్‌ను వరించింది. అవకాశాలను అందిపుచ్చుకోవడం‌లో కోహ్లీసేన విఫలమైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే ఈ మ్యాచ్‌ ఎలాంటి వివాదాలు లేకుండా సాఫిగా జరిగినప్పటికి జింబాబ్వే అంపైర్ లాంగ్టన్ రుసెర్ ఇచ్చిన ఓ ఔట్ నిర్ణయం అందరిని ఆకర్షించింది. అంపైర్ల తప్పిదాలపై మరోసారి చర్చకు దారితీసింది.

<strong>పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు</strong>పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

ఇంతకీ ఏం జరిగిందంటే..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతిని ఓపెనర్ హెన్రీ నికోలస్ ఫ్లిక్ చేయబోయాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి నేరుగా స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతులో పడింది. దీంతో భారత ఆటగాళ్లు అప్పీలు చేయగా.. వెంటనే అంపైర్ లాంగ్టన్ ఔటిచ్చాడు. అయితే బంతి బ్యాట్‌, ప్యాడ్లకు తగలలేదని, అది ఏమాత్రం ఎల్బీడబ్ల్యూ కాదనే నమ్మకంతో నికోలసస్ రివ్యూకు వెళ్లాడు.

రివ్యూతో బతికిపోయిన నికోలస్..

ఇక టీవీ అంపైర్ రిప్లేలో షమీ ఫైన్ డెలివరీని గమనించడంతో పాటు.. బంతి వికెట్లకు తాకే చాన్సుందా అని పరీక్షించాడు. కానీ వికెట్లకు బంతి చాలా దూరంలో ఎత్తులో వెళ్లింది. అలాగే బ్యాట్‌కు బంతి ఏమైన తగిలిందా అని కూడా చూడగా అది కూడా చాలా దూరం ఉండటంతో నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ లాంగ్టన్ తన తప్పును తెలుసుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. దీంతో నికోలస్ బతికిపోయాడు. అప్పటికి అతను చేసిన పరుగులు 5. ఇక అనంతరం ధాటిగా ఆడిన నికోలస్ 78 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

బుడ్డ పోరడు కూడా చెప్తాడు..

ఇక అంపైర్ లాంగ్టన్ నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. క్రికెట్‌ను ఫాలో అయ్యే బుడ్డ పోరడు కూడా అది నాటౌట్ అని చెప్తారని, పైగా బంతి బౌన్స్ అవ్వడం స్పష్టంగా కనిపించినా ఎలా ఔటిచ్చావని ప్రశ్నిస్తున్నారు. పోనీ బ్యాట్‌కు తగిలిందా అంటే అది లేదని, అయోమయానికి గురవ్వాల్సిన క్లోజ్‌డ్ కాల్ కూడా కాదని అభిప్రాయపడుతున్నారు. లాంగ్టన్ నిద్రపోయాడో ఏమో అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇక క్రికెట్ విశ్లేషకులు సైతం లాంగ్టన్ డిసిషన్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తప్పిదాలు చేయడం సహజమేనని కానీ మరీ ఇంత ఘోరంగా వ్యవహరించడం ఏందని మండిపడుతున్నారు. ఒకవేళ డీఆర్‌ఎస్ రూల్ లేకుంటే న్యూజిలాండ్ పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైడ్ల విషయంలో కూడా అంపైర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని మరికొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కే

టేలర్, శ్రేయస్ సెంచరీ..

టేలర్, శ్రేయస్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 103 ) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.

Story first published: Thursday, February 6, 2020, 13:12 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X