న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా బ్యాడ్‌ డేను గుర్తు చేసిన పాంటింగ్.. బ్యాట్‌ స్ప్రింగ్ ఎక్కడా? అంటూ ఫ్యాన్స్ ఫైర్

Wheres The Spring? Indian Fans Troll Ricky Ponting After He Tweets Image Of 2003 World Cup Bat

మెల్‌బోర్న్‌: భారత అభిమానులకు ఈ రోజు బాగా గుర్తుండిపోయే దినం. కోట్ల మంది ఆశలను అడియాశలు చేసిన సందర్భం. 20 ఏళ్ల స్వప్నం తుదిమెట్టుపై చేజారిన సమయం. అవును 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది ఇదే రోజు. 17 ఏళ్ల క్రితం ఎదురైన ఈ పరాభావం.. ఎంత మరిచిపోదామని అభిమానులు అనుకుంటున్నా ఏదో రకంగా మళ్లీ మళ్లీ గుర్తొస్తూనే ఉంది.

ఆసీస్ విధ్వంసం..

ఆసీస్ విధ్వంసం..

సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 125 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రికీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆసీస్‌ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. ఆసీస్ జట్టులో పాంటింగ్‌(140 నాటౌట్‌) భారీ సెంచరీకి తోడు గిల్‌ క్రిస్ట్‌(57), మాథ్యూ హేడెన్‌(37), డామియన్‌ మార్టిన్‌(88 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

మహిళల వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టే సత్తా స్మృతి మంధానకే ఉంది!!

సెహ్వాగ్ మినహా..

సెహ్వాగ్ మినహా..

అనంతరం చేజింగ్‌కు దిగిన భారత్ 39.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. భారత జట్టులో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(82), రాహుల్ ద్రవిడ్ (47) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సచిన్(4), గంగూలీ (24), కైఫ్(0), యువరాజ్ సింగ్(24) ఘోరంగా విఫలమయ్యారు.

స్ప్రింగ్‌లు వాడారంటూ...

అయితే ఈ ఫైనల్లో ఆసీస్ బ్యాట్స్‌మన్ తమ బ్యాట్లలలో స్ప్రింగ్‌లు వాడారని అప్పట్లో విపరీతంగా ప్రచారమైంది. ముఖ్యంగా అనాటి క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ విషయం బాగా తెలుసు.ప్రధాన పత్రికలు కూడా స్ప్రింగ్‌ల వ్యవహారంపై కథనాలు రాసాయి. అయితే తాజాగా ఈ బ్యాడ్‌డేను గుర్తు చేస్తూ ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ నాటి ఫైనల్ మ్యాచ్‌లో వాడిన బ్యాట్ ఫొటోను ట్వీట్ చేశాడు.

‘ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాం. మనకు తగినంత సమయం లభించింది. నా కెరీర్‌కు సంబంధించిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్లో నేను వాడిన బ్యాట్‌ ఇది ' అని దానికి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ ఫొటోలో నాటి బ్యాట్ రెండు వైపుల ఫొటోలు పెట్టాడు.

పాంటింగ్.. ఆ స్ప్రింగ్స్ ఎక్కడా?

అయితే ఈ వ్యవహారంలో భారత అభిమానులు పాంటింగ్‌పై ట్రోలింగ్‌కు దిగారు.‘నీ బ్యాట్‌ హ్యాండిల్‌ గ్రిప్‌ కింద స్ప్రింగ్‌ ఉంది కదా.. అది కూడా ఓపెన్‌ చేసి చూపించు'అని ఒకరు కామెంట్ చేయగా, ఆ బ్యాట్‌కు సంబంధించి స్ప్రింగ్‌ను ఎక్కడ దాచావ్‌' అని మరొకరు ప్రశ్నించారు. ‘ స్ప్రింగ్‌తో తయారు చేసిన బ్యాట్‌ అది' ఇంకొకరు వ్యంగ్యస్త్రాలు సంధించారు.

‘నీ బ్యాట్‌ అసల రూపం ఇది' అని ఆ బ్యాట్‌కు స్ప్రింగ్‌ తగలించిన ఎడిటెడ్ ఫొటోతో మరొకరు బదులిచ్చారు. ఇక ఐసీసీ మాత్రం ‘2003లో ఇదే రోజు' బదులిచ్చింది. 17 ఏళ్ల క్రితం (2003, మార్చి 23) ఇదే రోజున భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.

Story first published: Monday, March 23, 2020, 18:31 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X