న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షాహిద్ అఫ్రిది చీటింగ్ గురించి తెలుసా..?

When Shahid Afridi was caught biting the ball during a ODI

హైదరాబాద్: క్రికెట్‌లో బాల్‌ట్యాంపరింగ్ అనగానే మొదట గుర్తొచ్చే ఆటగాళ్లు.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఎక్కువ శిక్షను అనుభవించింది.
సౌతాఫ్రికాపర్యటనలో యువ ప్లేయర్ బెన్‌క్రాఫ్ట్‌ను ఉప్పుకాగితంతో బంతి ఆకారాన్ని దెబ్బతీయాలని ఉసిగొల్పి యావత్ క్రికెట్ ప్రపంచం ముందు దోషులగా నిలబడ్డారు. అప్పట్లో తీవ్ర సంచలనం రేకిత్తించిన ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు ఎలాంటి క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది.

అంతేకాకుండా స్మిత్‌ను కెప్టెన్సీ, వార్నర్‌లను వైస్ కెప్టెన్సీ హోదాల నుంచి తప్పించింది. సీనియర్ల ఆదేశాలతో తప్పు చేసిన యువ క్రికెటర్‌ బెన్‌క్రాఫ్ట్‌పై మాత్రం 9 నెలలు నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ ఘటనతో ఆస్ట్రేలియా జట్టు గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి మెరుపు కోసం చెమట, ఉమ్మిని వాడుతూ.. టవల్‌తో రుద్దవచ్చు. అంతేకానీ వేరే ఇతర వస్తువులతో బంతి ఆకారాన్ని దెబ్బతీయవద్దు.

అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బాల్ ట్యాంపరింగ్ అనేది తప్పే అయినప్పటికి.. క్రికెట్ ఆస్ట్రేలియా వారి పట్ల దారుణంగా వ్యవహరించింది. వీరికన్నా ముందు చాలా మంది క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించినా.. ఒకటి, రెండు మ్యాచ్‌లు మాత్రమే నిషేధానికి గురయ్యారు.

అడ్డంగా దొరికిన అఫ్రిది

అడ్డంగా దొరికిన అఫ్రిది

ఇక పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా బాల్‌ట్యాంపరింగ్‌కు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆస్ట్రేలియా‌తో 2010లో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో బంతిని నోటితో కొరికి దాని ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. దీన్ని టీవీ కెమెరాల్లో గుర్తించిన మ్యాచ్ రిఫరీ వెంటనే ఈ విషయాన్ని అంపైర్లకు తెలియజేశాడు. దీంతో బంతిని పరిశీలించిన అంపైర్లు మరో బాల్‌తో మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే ఇలా ఎలాంటి భయం లేకుండా పైగా లైవ్‌లో బంతి ఆకారాన్ని ఓ ఆటగాడు దెబ్బతీయడం అదే తొలిసారి.

కోహ్లీ బిగ్ ప్లేయరే.. కానీ అతనొక్కడితోనే ప్రపంచకప్ రాదు కదా: మాజీ క్రికెటర్

అలా చేసి ఉండాల్సింది కాదు..

అలా చేసి ఉండాల్సింది కాదు..

అనంతరం మ్యాచ్ రిఫరీ ముందు తన తప్పును ఒప్పుకొని అఫ్రిది విచారం వ్యక్తం చేశాడు. దీంతో అతనిపై ఐసీసీ రెండు టీ20 మ్యాచ్‌లు నిషేధం విధించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

‘నేను అలా చేయాల్సింది కాదు. కానీ జరిగిపోయింది. మ్యాచ్ గెలవడం కోసం మా బౌలర్లకు సాయం చేయాలని ప్రయత్నించాను. ప్రపంచంలోనే ఏ జట్టు ఇలా బంతి ఆకారాన్ని దెబ్బతీయలేదు. నేను చేసింది చాలా తప్పు. నేను చేసిన ఈ పనితో చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నా. నేను ఇలా చేయుండాల్సింది కాదు. మ్యాచ్ గెలవడం కోసం ఇలా తప్పుడు మార్గాన్ని ఎంచుకోవాల్సింది కాదు.'అని అఫ్రిది మీడియాముఖంగా తన తప్పును ఒప్పుకున్నాడు.

చిత్తుగా ఓడిన పాక్..

చిత్తుగా ఓడిన పాక్..

ఇక ఆ పర్యటనలో పాకిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. 5 వన్డేల సిరీస్‌ను 5-0తో, రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కోల్పోవడంతో పాటు ఏకైక టీ20లోను ఓడిపోయింది. ఇక అఫ్రిది ట్యాంపరింగ్ ప్రయత్నించిన మ్యాచ్‌లో అఫ్రిది సారథ్యం వహించాడు. ఆ మ్యాచ్ ముందే నాటి కెప్టెన్ మహ్మద్ యూసఫ్ మోకాలి గాయానికి గురవడంతో ఆ ఆఖరి వన్డేలో అఫ్రిది జట్టును నడిపించాడ. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49.3 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ 49.2 ఓవర్లలో 8వి కెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలుండగానే 2 వికెట్లతో గెలుపొందింది.

అఫ్రిది చీటర్ అంటూ..

అఫ్రిది చీటర్ అంటూ..

ఇక ఇటీవల కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ అఫ్రిది భారత్‌పై తనకున్న అక్కసును వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాక్ మాజీ క్రికెటర్‌కు భారత క్రికెటర్లు కౌంటరిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత నెటిజన్లు అఫ్రిది ట్యాంపరింగ్‌కు సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అఫ్రిది ఓ చీటర్ అంటూ మండిపడుతున్నారు.

తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!

Story first published: Friday, May 22, 2020, 15:14 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X