న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ బిగ్ ప్లేయరే.. కానీ అతనొక్కడితోనే ప్రపంచకప్ రాదు కదా: మాజీ క్రికెటర్

Mohammad Kaif Says Kohli is a big player, but not an individual to win big tournaments.


హైదరాబాద్:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ ప్లేయరేనని, కానీ అతనొక్కడితోనే ప్రపంచకప్ వంటి టోర్నీలను గెలవలేమని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. జట్టుగా రాణిస్తేనే ఐసీసీ టోర్నీల్లో విజయం సాధిస్తామన్నాడు.

కరోనా లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన కైఫ్ గురువారం హలోయాప్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా కోహ్లీ ఎన్ని రికార్డులు సృష్టించినా ప్రపంచకప్ వంటి చిరస్మరణీయ విజయాలందించాలంటే మాత్రం అతనికి మంచి జట్టు కావాలన్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలతో పెద్ద టోర్నీల్లో విజయాలు సాధించలేమని తెలిపాడు.

మంచి జట్టును ఎంచుకోవాలి..

మంచి జట్టును ఎంచుకోవాలి..

జట్టు సెలెక్షన్, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే విషయంపై కోహ్లీ మరింత శ్రద్ద వహించాలన్నాడు. ‘వ్యక్తిగతంగా కోహ్లీ ఓ పెద్ద ఆటగాడు. కానీ పెద్ద టోర్నీల్లో గెలవాలంటే జట్టు మొత్తం కృషి చేయాలి. దీనిపై కోహ్లీ దృష్టిపెట్టాడనుకుంటున్నా. అలాగే అతను టీమ్ సెలెక్షన్, యువ ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకునేందుకు అండగా నిలవాలి.'అని తెలిపాడు.

విశాఖలో ధోనీ విధ్వంసాన్ని ఊహించలేదు.. అలాంటి ఇన్నింగ్స్ మళ్లీ చూడలేదు: కైఫ్

 గంగూలీకి మరో అవకాశం ఇవ్వాలి..

గంగూలీకి మరో అవకాశం ఇవ్వాలి..

ఇక మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీని కైఫ్ కొనియాడాడు. దాదా ముక్కుసూటి మనిషని, తక్కువ సమయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకునేవాడని గుర్తు చేసుకున్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా అతనికి మరో టర్మ్ అవకాశం ఇవ్వాలన్నాడు.‘దాదా ముక్కుసూటి మనిషి. చాలా తక్కువ సమయంలోనే అద్బుత నిర్ణయాలు తీసుకున్నాడు. ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తూ సిస్టమ్‌ను సానుకూలంగా మార్చాడు. కాబట్టి బీసీసీఐ బాస్‌గా అతనికి మరో అవకాశం ఇవ్వాలి'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్..

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్..

ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫేవరేట్ అని కైఫ్ తెలిపాడు. ‘కంగారూల గడ్డపై జరుగుతుంది కాబట్టి ఆసీస్ జట్టుకు మంచి అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, రోహిత్ వంటి హార్ద్ హిట్టర్స్ ఉన్న భారత జట్టు కూడా ఫేవరెటే. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో నా భార్యకు సాయం చేస్తున్నా. 2004 పాక్ పర్యటనలో ఆడిన ఇన్నింగ్స్ నా ఫేవరేట్. మహేంద్ర సింగ్ ధోనీకి నేను ఫ్యాన్‌ని.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు. 2002లో యువరాజ్ సింగ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా కైఫ్ అభిమానులతో పంచుకున్నాడు.

మా టైమ్‌లో యోయో ఉంటే..

మా టైమ్‌లో యోయో ఉంటే..

ప్లేయర్ ఫిట్‌గా ఉంటే 40 ఏళ్ల వరకు కూడా ఆడొచ్చని కైఫ్ తెలిపాడు. తమ కాలంలో యోయో టెస్ట్ ఉంటే.. తాను, లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ అలవోకగా అధిగమించేవాళ్లమని తెలిపాడు. ఇతరుల గురించి మాత్రం తనకు తెలియదన్నాడు. భారత జట్టులో కేఎల్ రాహుల్ చాలా ఫిట్‌గా ఉంటాడని చెప్పాడు. సక్సెస్‌కి షార్ట్ కట్ ఉండదని, విజయవంతం కావాలంటే ఎంతో కష్టపడాలని, కొన్ని త్యాగాలు కూడా చేయాలన్నాడు. భారత్ తరఫున ఆడేందుకు ఎంతో మంది ఆటగాళ్లు వేచి చూస్తున్నారన్నాడు.

తండ్రిని ఎక్కించుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయికి బంపరాఫర్!

Story first published: Friday, May 22, 2020, 12:05 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X