న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్.. ఎప్పుడంటే?

When God of Cricket Sachin Tendulkar once fielded for Pakistan

హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓసారి పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేశాడు. అది కూడా అతను అంతర్జాతీయ క్రికట్‌లోకి రాకముందే. అవును ఈ విషయాన్ని మాస్టరే తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మైవే'లో తెలిపాడు. ఇక ముక్కు పచ్చలారని 16 ఏళ్ల వయసులో 1989లో పాకిస్థాన్‌పై సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

అరంగేట్రానికి ముందే..

అరంగేట్రానికి ముందే..

అయితే అరంగేట్రానికి రెండేళ్ల ముందు 1987లో 14 ఏళ్ల సచిన్.. పాక్ తరఫున సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేశాడంట. 1987 భారత పర్యటనలో భాగంగా భారత్‌తో ముంబై వేదికగా జరిగిన నాటి ఫెస్టివల్ మ్యాచ్‌లో అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కోరిక మేరకు సచిన్ మైదానంలోకి అడుగుపెట్టాడంట. ‘ఇమ్రాన్ ఖాన్‌కు ఇది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ.. అతని కోరకు మేరకు నేను పాక్ తరఫున ఫీల్డింగ్ చేశా. పాక్ క్రికెటర్లు జావెద్ మియాందాద్, అబ్దుల్ ఖాదీర్ లంచ్ బ్రేక్ కోసం మైదానం వీడటంతో.. ఇద్దరు లోకల్ ప్లేయర్లు కావాలని ఇమ్రాన్ అడిగాడు. అప్పుడు నేను మైదానంలోకి అడుగుపెట్టా.'అని సచిన్ తన బుక్‌లో రాసుకొచ్చాడు.

19 ఏళ్ల‌ కెరీర్‌లో 1999 ఇండియా టూర్ నాకెంతో స్పెషల్: వసీమ్ అక్రమ్

జస్ట్.. కపిల్ క్యాచ్ మిస్

జస్ట్.. కపిల్ క్యాచ్ మిస్

ఆ మ్యాచ్‌లో భారత దిగ్గజ ఆటగాడైన కపిల్ దేవ్‌ను క్యాచ్ ఔట్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాననే విషయాన్ని కూడా సచిన్ ప్రస్తావించాడు.‘చాలా దూరం పరిగెత్తినా బంతిని అందుకోలేకపోయాను. లాంగాన్‌లో కాకుండా మిడ్ ఆన్‌లో ఉంచితే ఖచ్చితంగా బంతిని అందుకునేవాడిని'అని సచిన్ పేర్కొన్నాడు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ముంబై బ్రాబోర్న్ మైదానం వేదికగా నిర్వహించిన నాటి 40 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రవిశాస్త్రి సారథ్యంలో భారత్ 183 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్నందుకుంది. రోజర్ బిన్నీ, మహ్మద్ అజారుద్దీన్ ,భరత్ అరుణ్‌లు కూడా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 5 టెస్ట్‌ల సిరీస్‌లోనే సునీల్ గావస్కర్ అంతర్జాతీయ టెస్ట్‌కు వీడ్కోలు పలికాడు.

ఫాస్ట్ బౌలర్‌గా ఎదగాలని..

ఫాస్ట్ బౌలర్‌గా ఎదగాలని..

ఇక సచిన్ అద్భుత స్పిన్నరనే విషయం మనందరికి తెలిసిందే. అతను తన కెరీర్‌లో తీసిన 201 వికెట్లే (వన్డేల్లో 154, టెస్ట్‌ల్లో 46, టీ20ల్లో 1) ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అలాంటి సచిన్ కెరీర్ ప్రారంభంలో పేస్ బౌలింగ్ చేసేవాడంట. ఈ విషయాన్ని కూడా అతనే చెప్పాడు. నాణ్యమైన పేసర్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ డెన్నిస్ లిల్లీ పర్యవేక్షణలో ఎంఎఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఏర్పాటైందని, ఆ క్యాంప్‌తో ఫాస్ట్ బౌలర్‌గా తన స్వల్ప కాలిక కెరియర్ ముగిసిందని సచిన్ తెలిపాడు.

గేల్‌కు ఉన్న బలం.. డివిలియర్స్‌లోని సామర్థ్యం కోహ్లీకి లేదు: గంభీర్

డెన్నిస్ లిల్లీ పరిహాసం

డెన్నిస్ లిల్లీ పరిహాసం

తన ఎత్తు, శరీర సౌష్టవాల వల్ల తాను మంచి పేసర్ కాలేనని, బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలని డెన్నిస్ లిల్లీ ఎగతాళి చేశాడని సచిన్ పేర్కొన్నాడు.

‘ఫౌండేషన్ క్యాంప్ నిర్వహించే ముందు దేశ వ్యాప్తంగా ఉన్న కోచ్‌లను ప్రతిభ కలిగిన ఆటగాళ్ల పేర్లు చెప్పాలని కోరేవారు. అలా వాసు పరంజ్‌పే సర్ నా పేరు సూచించారు. అయితే చెన్నై వేదికగా జరిగిన ఆ క్యాంప్‌కు బ్యాటింగ్ కిట్ కూడా తీసుకెళ్లమన్నాడు. బౌలర్‌గా ఎంపికవ్వకుంటే బ్యాటింగ్‌లోనైనా మెళకువలు నేర్చుకోవచ్చనదే పరంజ్‌పే సర్ ఉద్దేశం. ఇక నా ఎత్తు, శరీర సౌష్టవం వల్ల పేసర్‌గా ఎదగలేనని డెన్నిస్ లిల్లీ సూచించాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని పరిహాసం కూడా ఆడాడు.' అని సచిన్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.

Story first published: Wednesday, June 17, 2020, 16:09 [IST]
Other articles published on Jun 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X