19 ఏళ్ల కెరీర్‌లో 1999 ఇండియా టూర్ నాకెంతో స్పెషల్: వసీమ్ అక్రమ్

చెన్నై: 19 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో 1999 భారత పర్యటన తనకెంతో ప్రత్యేకమని పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ అన్నాడు. ఆ టూర్‌ను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. తన సారథ్యంలోనే బరిలోకి దిగిన ఆ సీరీస్‌లో చెన్నై వేదికగా అందుకున్న విజయం అద్భుతమని, భారత అభిమానులు నిలబడి చప్పట్లతో అభినందించారని ఈ మాజీ పేసర్ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు మేం భారత్‌పై విజయాలు సాధించినా.. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నాడు. పొడ్‌క్యాస్ట్ వేదికగా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌తో జరిపిన చిట్‌చాట్‌లో అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఉద్వేగానికి లోనయ్యాం..
‘దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మేం భారత్‌తో టెస్ట్ క్రికెట్ ఆడాం. ఆ టూర్‌లో పాక్ టీమ్‌కు నేనే సారథి. చెన్నైలో తొలి టెస్ట్. స్టేడియం మొత్తం నిశబ్ధంగా ఉండటంతో మా ఆటగాళ్లు కాస్త ఆందోళనకు గురయ్యాం. కానీ మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో ఆ మ్యాచ్ గెలిచాం. చెన్నై అభిమానులు స్టాండింగ్ ఓవేషన్(నిలబడి అభినందనలు తెలపడం) ఇవ్వడంతో మేం ఉద్వేగానికిలోనయ్యాం. చాలా అద్బుతంగా అనిపించింది. అందుకే నా కెరీర్‌లో ఈ పర్యటన చాలా ప్రత్యేకం.'అని అక్రమ్ చెప్పుకొచ్చాడు.
అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!

భారత్‌పై రాణిస్తే గుర్తింపు.
భారత్‌పై రాణించే తమ క్రికెటర్లకు పాక్‌లో గొప్ప గుర్తింపు లభిస్తుందన్నాడు. సేమ్ ఇండియాలో కూడా అదే జరుగుతుందన్నాడు. 90ల్లో టీమిండియాపై తాము ఎన్నో విజయాలు సాధించినా.. ఇప్పుడు చరిత్ర మొత్తం తారుమారైందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ను ఓడించడం పాక్‌కు శక్తికి మించిన పనిగా మారిపోయిందన్నాడు. క్లిష్ట సమయాల్లో సానుకూల దృక్పథంలోనే తాను ఒత్తిడిని జయించేవాడినని చెప్పాడు.

సానుకూల ఆలోచనలతో..
‘ప్రతీ విషయంలో నేను పాజిటివ్ అంశాన్ని చూస్తా. ఎందుకంటే ఒత్తిడి విషయంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులే చాలా సార్లు దెబ్బతిన్నారు. అందుకే కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్లడాన్ని నేను ఇష్టపడుతా. నా జీవితంలో ఎదురైన ప్రతి కష్టకాలంలో నేను ఇలాగే ఉండి విజయం సాధించా. మన సన్నాహకలపై నమ్మకం పెట్టుకుంటే విజయాలు వాటంత అవే వస్తాయి'అని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.

12 పరుగులతో ఓడిన భారత్..
ఇక హోరాహోరిగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ గెలుపు ముంగిట చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్.. ద్రవిడ్, గంగూలీ హాఫ్ సెంచరీలతో ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 254 పరుగులకే ముగించింది. ఇక షాహిద్(141) అఫ్రిది అద్భుత సెంచరీతో చెలరేగడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి భారత్‌కు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ విజృంభించడంతో భారత్.. 258 పరుగులకే పరిమితమై 12 పరుగులతో ఓటమిపాలైంది. భారత జట్టులో సచిన్ (136), మోంగియా(32) పోరాడినా ఫలితం లేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కరోనా కష్టకాలంలో ఇర్ఫాన్ పఠాన్ పెద్ద మనసు!