గేల్‌కు ఉన్న బలం.. డివిలియర్స్‌లోని సామర్థ్యం కోహ్లీకి లేదు: గంభీర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ సక్సెస్ అయినా.. కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడని, ఇప్పటి వరకు సారథిగా అతను సాధించిందేం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ బీజీపీ ఎంపీ.. తాజాగా విరాట్‌ను తక్కువ చేస్తూనే ప్రశంసించాడు. విరాట్ చాలా తెలివైన ఆటగాడని మెచ్చుకుంటూనే.. అతనికి వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఉన్న బలం... సౌతాఫ్రికా లెజెండ్ డివిలియర్స్‌కు ఉన్న సామర్థ్యం లేదన్నాడు. కేవలం ఫిట్‌నెస్‌తోనే క్రికెట్‌లో రాణిస్తున్నాడని తెలిపాడు.

ఇస్మార్ట్ విరాట్..
స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న గంభీర్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా ఎదగడానికి కారణం ఏందని ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చాడు. ‘విరాట్ చాలా తెలివైన ఆటగాడు. చాలా ఫిట్‌గా ఉండటంతోనే టీ20 క్రికెట్‌లో సక్సెస్ అవుతున్నాడు. ఎందుకంటే అతనికి క్రిస్ గేల్ కండ బలం లేదు.. డివిలియర్స్, జాక్వస్ కల్లిస్, బియన్ లారాలా సామర్థ్యం లేదు. కానీ అతని అతిపెద్ద బలం ఫిట్‌నెస్. ఆ బలంతోనే ఆడుతూ సక్సెస్ అవుతున్నాడు. ఆ విషయంలో మనమంతా అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా వికెట్ల మధ్య విరాట్ అద్భుతంగా పరుగెత్తుతాడు. చాలా మంది రన్స్ తీయరు. అదే అతని సక్సెస్ సీక్రెట్'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ కంటే కోహ్లీనే బెస్ట్..
రోహిత్ శర్మ కంటే కెప్టెన్ విరాట్ కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగ్‌లో కోహ్లీ ప్రతి బంతికీ స్ట్రైక్ రొటేట్ చేయగలడు, కానీ రోహిత్‌లో ఆ టాలెంట్ లేదన్నాడు. స్పిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ప్రతి బంతికీ స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. కానీ రోహిత్ శర్మలో ఆ టాలెంట్ లేదు. అయితే రోహిత్ శర్మ భారీ షాట్లు ఆడగలడు. మ్యాచ్‌లలో హిట్టింగ్ కంటే.. స్ట్రైక్ రొటేట్ చేయగలిగిన బ్యాట్స్‌మెనే నిలకడగా రాణించగలడు. రోహిత్ శర్మకే కాదు.. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి వారికి స్పిన్‌లో స్ట్రైక్ రొటేట్ చేసే సామర్థ్యం లేదు' అని గంభీర్ వెల్లడించాడు.

కెప్టెన్‌గా సాధించిందేమీ లేదు
టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సాధించిందేమి లేదని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. 'నిజం చెప్పాలంటే భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీ గొప్ప విజయాలేమీ సాధించలేదు. బ్యాట్స్‌మన్‌గా భారీగా పరుగులు చేస్తున్నాడు. మిగతా వారి కంటే అతను ప్రత్యేకం. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను అతను బయటకి తీయాలి. తన సామర్థ్యంతో వారిని పోల్చకూడదు. ఎవరికి వారే ప్రత్యేకం కాబట్టి వారిలో అత్యుత్తమ ఆట బయటకు వచ్చేలా కోహ్లీ ప్రోత్సహించాలి. ప్రపంచకప్ లాంటి మెగా టైటిళ్లు గెలిస్తేనే గొప్ప. లేకుంటే కెరీర్‌లో అదో లోటుగా మిగిలిపోతుంది'అని అభిప్రాయపడ్డాడు.

ఒత్తిడి తట్టుకునే శక్తి లేదు
ఒత్తిడిని తట్టుకునే విషయంలో మెరుగవ్వనంత వరకూ టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ చాంపియన్స్ కాలేరన్నాడు.‘కీలకమైన మ్యాచ్‌ల్లో ఎలా ఆడతావన్నదాన్ని బట్టే జట్టులో నువ్వు మంచి ఆటగాడివా? అత్యద్భుతమైన ప్లేయరా? అనేది తెలుస్తుంది. ఇతర జట్లు ఒత్తిడిని అధిగమించిన విధంగా మనోళ్లు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మనం ఆడిన సెమీఫైనల్స్, ఫైనల్స్‌ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.'అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కరోనా కష్టకాలంలో ఇర్ఫాన్ పఠాన్ పెద్ద మనసు!