న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ మొదటికొచ్చిన No. 4 సమస్య: కేఎల్ రాహుల్ ఖాయమైనట్టేనా?

IND V WI 2019, 1st ODI : Why KL Rahul Is India's Ideal No. 4 For The ODI Series || Oneindia Telugu
West Indies vs India 2019: Why KL Rahul is Indias ideal No. 4 for the ODI series

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రస్తుత వరల్డ్ టీ20 ఛాంపియన్స్‌గా ఉన్న వెస్టిండిస్‌ను ఆరు టీ20ల్లో వరుసగా ఓడించిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫోకస్ వన్డే సిరిస్‌కు మళ్లింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో గుయానా వేదికగా గురువారం ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది.

<strong>రోహిత్ Vs గేల్: ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో, కొత్త విషయం వెలుగులోకి!</strong>రోహిత్ Vs గేల్: ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో, కొత్త విషయం వెలుగులోకి!

4వ స్థానంలో కేఎల్ రాహుల్

4వ స్థానంలో కేఎల్ రాహుల్

దీంతో కేఎల్ రాహుల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. నిజానికి ఈ No. 4 సమస్య ఇప్పటిది కాదు. వరల్డ్‌కప్‌కు ముందు నుంచే ఉన్నప్పటికీ ఈ సమస్యకు సెలక్టర్లు సరైన పరిష్కారాన్ని చూపలేకపోయారు. అయితే, ఈ సిరిస్‌లో యువ ఆటగాళ్లు మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్‌లను మిడిలార్డర్‌లో పరీక్షించనున్నారు.

చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

మిడిలార్డర్‌లో మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌

మిడిలార్డర్‌లో మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌

మిడిలార్డర్‌లో మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌ చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరిలో ఒకరికి అవకాశం రావొచ్చు. ఇక, ఎప్పటిలాగే మొదటి మూడు స్థానాల్లో రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ బ్యాటింగ్‌కు రావడం ఖాయం. దీంతో కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో ఆడొచ్చు. వరల్డ్‌కప్‌లో నిరాశపరిచిన కేదార్‌ జాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.

నవ్‌దీప్‌ సైనిని వన్డేల్లోనూ ఆడించడం ఖాయమే

నవ్‌దీప్‌ సైనిని వన్డేల్లోనూ ఆడించడం ఖాయమే

రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్ యజువేంద్ర చాహల్‌.. ఈ నలుగురిలో ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశముంది. టీ20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన యువ పేసర్ నవ్‌దీప్‌ సైనిని వన్డేల్లోనూ ఆడించడం ఖాయం. కాగా, వారం రోజుల వ్యవధిలో భువనేశ్వర్ రెండు దేశాల్లో 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

సూపర్ స్పెల్.. రికార్డు సృష్టించిన దీపక్‌ చాహర్‌

అభిమానులను అలరించనున్న క్రిస్ గేల్

అభిమానులను అలరించనున్న క్రిస్ గేల్

దీంతో అతడికి మొదటి వన్డేలో విశ్రాంతినిస్తే... అతడి స్థానంలో మహమ్మద్ షమీతో భర్తీ చేస్తారా? లేక ఖలీల్‌ అహ్మద్‌కు అవకాశమిస్తారా అన్నది ఆసక్తికరం. మరోవైపు వెస్టిండిస్ జట్టు కూడా పటిష్టంగానే ఉంది. మూడు టీ20ల సిరిస్‌కు దూరమైన క్రిస్ గేల్ వన్డే సిరిస్‌లో అభిమానులను అలరించనున్నాడు.

Story first published: Thursday, August 8, 2019, 14:52 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X