
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు:
మూడో టీ20లో దీపక్ సూపర్ స్పెల్ వేసాడు. మూడు ఓవర్లలలో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. దీంతో దీపక్ ఓ రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో వెస్టిండీస్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. నవదీప్ సైనీ కూడా మూడు వికెట్లు తీసినా.. ఎకానమీ అధికంగా ఉంది. దీపక్, కుల్దీప్, సైనీ, మిశ్రా, నెహ్రాలు మూడు వికెట్లు తీశారు. మరోవైపు అత్యుత్తమ ఎకానమీ ఇచ్చిన రెండో బౌలర్‌గా దీపక్ (1.23) నిలిచాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (1.00) తొలి స్థానంలో ఉన్నాడు.

3 ఓవర్లు.. 4 పరుగులు:
మూడో టీ20లో దీపక్ సూపర్ స్పెల్ వేసాడు. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ సునీల్ నరైన్ (2) వికెట్ తీసాడు. రెండో ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. మరో ఓపెనర్ లూయిస్ (10), హెట్‌మైర్ (1)లను ఎల్బీడబ్ల్యూలుగా ఔట్ చేయడంతో పాటు మెయిడిన్‌గా ముగించాడు. ఇక మూడో ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చిన దీపక్.. 3-1-4-3 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. దీంతో దీపక్ చాహర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
ప్రొ కబడ్డీ లీగ్‌లో చరిత్ర సృష్టించిన పర్దీప్ నర్వాల్

పాత బంతులతో సాధన చేస్తా:
మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్ మాట్లాడుతూ... 'వాతావరణం చాలా బాగుంది. వాతావరణం, పిచ్ అనుకూలంగా ఉన్నందున బంతిని స్వింగ్ చేయడానికి ప్రయత్నించా. తేమ ఉండటంతో ఫుల్‌లెంగ్త్ బంతులు కూడా వేశాను. పరిస్థితుల కారణంగా ఔట్ స్వింగర్స్ కంటే ఇన్ స్వింగర్స్ ఎక్కువగా వేసా. దీంతో విండీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. సాధారణంగా పాత బంతులతో నెట్స్‌లో బౌలింగ్ చేస్తా. దీంతో నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటా. ఒకవేళ బంతి బాగా స్వింగ్ అవుతున్నప్పుడు వైవిధ్య బంతులు వేయను. ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా. అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా' అని చాహర్ తెలిపాడు.

బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదంలోకి నెట్టగలడు:
మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ ఒకటే. కొత్త బంతితో భువిలాగే దీపక్ ఆడగలడు. కొత్త బంతితో దీపక్ ప్రమాదకారి. తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదంలోకి నెట్టగలడు. ఐపీఎల్-12లో కూడా అతని ప్రదర్శన బాగుంది' అని కోహ్లీ తెలిపాడు.


Click it and Unblock the Notifications












