న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

IND V WI 2019,1st ODI : Chahal Comes Up With Hilarious Comment After Rohit Interviews Pant
India vs West Indies: Yuzvendra Chahal funny comment after Rohit Sharma interviews Rishab Pant

గయానా: టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ పాత్రను ఓపెనర్ రోహిత్ శర్మ పోషించాడు. దీంతో బీసీసీఐని ఉద్దేశించి చాహల్‌ ఓ సరదా ట్వీట్‌ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (42 బంతుల్లో 65 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

<strong>విండీస్‌తో నేడు తొలి వన్డే.. సైనీకి అరంగేట్రం చాన్స్‌!!</strong>విండీస్‌తో నేడు తొలి వన్డే.. సైనీకి అరంగేట్రం చాన్స్‌!!

పంత్‌తో రోహిత్‌ ఇంటర్వ్యూ:

మ్యాచ్ అనంతరం రిషబ్‌ పంత్‌ను ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ చేసాడు. రిషబ్ 'సంత్'.. ఓ సారీ రిషబ్‌ పంత్‌ అంటూ రోహిత్ ఇంటర్వ్యూ మొదలెట్టాడు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'గయానా డైరీలు: రోహిత్, పంత్ ఇంటర్వ్యూ. రెండు తక్కువ స్కోర్ల తర్వాత మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకం. చివరి టీ20లో పంత్ ఎలా ఆడాడో రోహిత్ తెలుసుకుంటున్నాడు' అని బీసీసీఐ రాసుకొచ్చింది.

మిస్సింగ్‌ మీ:

సమయం దోరికినప్పుడల్లా 'చాహల్‌ టీవీ' ద్వారా చాహల్‌ టీమిండియా ఆటగాళ్లని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు. అయితే ఈసారి మాత్రం చాహల్‌ పాత్రను రోహిత్‌ పోషించాడు. దీంతో చాహల్‌ బీసీసీఐని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేసాడు. 'మిస్సింగ్‌ మీ' (నన్ను కోల్పోతున్నారు) అంటూ రీట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది.

నా ఆటమీద నమ్మకం ఉంది:

నా ఆటమీద నమ్మకం ఉంది:

బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో పంత్‌ మాట్లాడుతూ... 'మొదటి రెండు మ్యాచ్‌లలో తక్కువ పరుగులు చేశా. అయినా నా ఆటమీద నాకు నమ్మకం ఉంది. దీంతో మూడో టీ20లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడా. ఎటువంటి ఒత్తిడికి గురికాలేదు. క్రీజులోకి వచ్చాక తొలుత మంచి భాగస్వామ్యం నెలకొల్పి.. ఆ తర్వాత హిట్టింగ్ చేయాలని అనుకున్నా' అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌లో చరిత్ర సృష్టించిన పర్దీప్‌ నర్వాల్‌

చాహల్‌కే అవకాశం:

చాహల్‌కే అవకాశం:

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ప్రావిడెన్స్‌ మైదానంలో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ప్రపంచకప్‌లో రాణించకపోవడంతో టీ20 సిరీస్‌కు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో విండీస్‌తో వన్డే సిరీస్‌ వీరికి సవాల్‌తో కూడుకున్నది. అయితే రవీంద్ర జడేజా ఉంటాడు కాబట్టి ఒక్కరికే అవకాశం దక్కొచ్చు. చాహల్‌ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Thursday, August 8, 2019, 11:16 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X