న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jasprit Bumrah భారీ సిక్సర్.. బిత్తర పోయిన ఇంగ్లండ్ బౌలర్.. అచ్చం రోహిత్ శర్మలానే! (వీడియో)

 WATCH: Jasprit Bumrah smacks Sam Curran for a huge six in first Test

నాటింగ్ హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌లోకి వచ్చాడు. ముందుగా బౌలింగ్‌లో 4 వికెట్లతో సత్తా చాటిన యార్కర్ల కింగ్.. ఆ తర్వత బ్యాటింగ్‌లో రాణించి ఆశ్చర్యపరిచాడు. మూడో రోజు ఆటలో పదో స్థానంలో బ్యాటింగ్‌‌కు బుమ్రా(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28)మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 బౌండరీలు బాదాడు. ఊహించని విధంగా జస్‌ప్రీత్ బుమ్రా ఎదురుదాడి చేయడంతో సామ కరన్ బిత్తరపోయాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బౌలర్‌పై కన్నెర్ర చేశాడు.

Ind vs Eng 2021 : Bumrah Six కి షాక్ అయిన Sam Curran.. కన్నెర్ర చేసిన Joe Root || Oneindia Telugu

అసలేం జరిగిందంటే..?

ఇన్నింగ్స్ 81వ ఓవర్ వేసిన సామ్ కరన్ బౌలింగ్‌లో మొదటి బంతిని మిడ్ వికెట్ దిశగా బౌండరీకి తరలించిన జస్‌ప్రీత్ బుమ్రా.. రెండో బంతిని రోహిత్ శర్మ తరహాలో ఫుల్ షాట్ ఆడి సిక్స్‌గా మలిచాడు. బౌన్సర్ రూపంలో వచ్చిన బంతిని సాహసోపేతంగా బుమ్రా ఫుల్ చేయగా.. డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఫీల్డర్ ఉన్నా అతని తలపై నుంచి బంతి సిక్స్‌గా వెళ్లింది. దాంతో ఆశ్చర్యపోవడం ఇంగ్లండ్ ఆటగాళ్ల వంతైంది. ఆ తర్వాత మూడో బంతిని స్టంప్‌ లైన్‌పై సామ్ కరన్ విసరగా.. బుమ్రా డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అదనపు బౌన్స్ కారణంగా బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్ ఫీల్డర్ల తలమీదుగా బౌండరీకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సచిన్ ఫిదా..

ఇక బుమ్రా సిక్స్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యాడు. యార్కర్ల కింగ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. 'టేయిలండర్స్ చేసిన విలువైన పరుగులతో టీమిండియాకు మంచి ఆధిక్యం లభించింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఎలా ఆడుతుందనే ఆసక్తి నెలకొంది. ఇక జస్‌ప్రీత్ బుమ్రా తన జీవితంలోనే గుర్తిండిపోయే షాట్ ఆడాడు.'అని మాస్టర్ ట్వీట్ చేశాడు. ఇక అభిమానులు సైతం బుమ్రా బ్యాటింగ్‌ను మెచ్చుకుంటున్నారు. భారత టెయిలండర్లే 48 పరుగులు జోడించడంతో భారత్‌కు 95 పరుగుల భాగస్వామ్యం లభించింది.

మెరిసిన జడేజా..

మెరిసిన జడేజా..

ఓవర్‌నైట్‌ స్కోరు 125/4తో మూడో రోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 278 వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (84) మరో 27 రన్స్‌ జోడించగా... ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (86 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బుమ్రా 28, పంత్‌ 25 పరుగులు చేశారు. రాబిన్‌సన్‌ 5, అండర్సన్‌ 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి 25/0 స్కోరు చేసింది. వర్షం కారణంగా చివరి సెషన్‌ రద్దు చేశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 183 స్కోరు వద్ద ఆలౌటైంది.

సంక్షిప్త స్కోర్లు:

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:183 ఆలౌట్‌; (జోరూట్ 64, బుమ్రా 4/46, మహ్మద్ షమీ 3/28)

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 278 ఆలౌట్‌ (కేఎల్‌ రాహుల్‌ 84, జడేజా 56, రోహిత్‌ 36; బుమ్రా 28; రాబిన్‌సన్‌ 5/85, అండర్సన్‌ 4/54)

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 25/0 (బర్న్స్‌ 11 బ్యాటింగ్‌, సిబ్లే 9 బ్యాటింగ్‌).

Story first published: Saturday, August 7, 2021, 10:32 [IST]
Other articles published on Aug 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X