For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: ఆ ఫ్లాప్ స్టార్‌పై వేటు.. ఇంగ్లండ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే సెమీఫైన్-2లో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి.

వెస్టిండీస్‌తో తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన భారత్.. అదే జోరు కనబర్చి ఇంగ్లండ్‌ను మట్టికరిపించాలనుకుంటుంది. తద్వారా టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. బలబలాల పరంగా ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లీగ్ దశను భారత్ అజేయంగా ముగిస్తే.. సూపర్-8ను ఇంగ్లండ్ అజేయంగా ముగించి సెమీస్‌కు అర్హత సాధించింది.

అభిషేక్ శర్మపై వేటు..

పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ‌ను తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. విండీస్‌తో మ్యాచ్‌లో రెండు సునాయస క్యాచ్‌లను వదిలేసాడు.

ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంలో అభిషేక్ శర్మ తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టి రింకూ సింగ్‌ను ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆ సాహసం చేయకపోవచ్చు. ఎలాంటి మార్పులు లేకుండా గత కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

India Playing XI vs England for T20 World Cup 2026 Semi-Final Rinku Singh Replaces Abhishek Sharma

వరుణ్ చక్రవర్తీ? కుల్దీప్ యాదవ్..?

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ గత మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా తడబడ్డాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో వరుణ్ చక్రవర్తీని తప్పించి కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇంగ్లండ్‌పై వరుణ్ చక్రవర్తీకి మెరుగైన రికార్డ్ ఉంది. కాబట్టి అతన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది.

అలా అని కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే టీమిండియా బ్యాటింగ్‌ డెప్త్ తగ్గనుంది. కాబట్టి మరోసారి కుల్దీప్ యాదవ్‌కు నిరాశే ఎదురవ్వనుంది. టీ20ల్లో ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో ఆడితే ప్రయోజనం ఉంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్ గట్టిగా నమ్ముతుంది. వ్యూహాత్మకంగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితమవుతారు.

IND vs WI: ఆ ఫ్లాప్ స్టార్‌ను తప్పించండి.. నెటిజన్ల డిమాండ్!IND vs WI: ఆ ఫ్లాప్ స్టార్‌ను తప్పించండి.. నెటిజన్ల డిమాండ్!

బ్యాటింగ్ లైనప్ అదే..

బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులు జరిగే ఛాన్స్ లేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఆడనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూను తిరిగి ఆడించగా.. అతను కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఇషాన్ కిషన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ మిడిల్, లోయార్డర్‌లో ఆడనున్నారు. రింకూ సింగ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. సూర్య ఒత్తిడిని పక్కనపెట్టి స్వేచ్చగా ఆడాల్సిన అవసరం ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. హార్దిక్ అతనికి అండగా నిలవనున్నాడు. శివమ్ దూబేతో బౌలింగ్ వేయించలేని పరిస్థితి నెలకొంది. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఎవరా? అనేది టీమిండియాకు సవాల్‌గా మారింది. సిరాజ్‌‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురు కానుంది.

ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో తలపడే భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా.

అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: సంజూ శాంసన్అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: సంజూ శాంసన్

Story first published: Wednesday, March 4, 2026, 18:49 [IST]
Other articles published on Mar 4, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+