ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ పోరులో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన ఉత్కంఠభరిత విజయం తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ దిగ్గజం, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ హార్దిక్ పాండ్యాను 'బిగ్ మ్యాచ్ ప్లేయర్'గా అభివర్ణించాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యాలోని పోరాట పటిమను, క్లిష్ట పరిస్థితుల్లో అతను చూపించే సమయస్ఫూర్తిని కొనియాడారు. "ఒక ఆటగాడికి నైపుణ్యం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తట్టుకునే మనస్తత్వం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు టాలెంట్ కంటే ఆటగాడి క్యారెక్టర్‌ను బట్టి వారిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అవుతుంది. పాండ్యా అటువంటి క్యారెక్టర్ ఉన్న ప్లేయర్, అతను పెద్ద స్టేజ్ కోసమే పుట్టినట్లుగా కనిపిస్తాడు" అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.

కీలక సమయాల్లో పాండ్యా ఆల్ రౌండ్ షో
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తన విలువను నిరూపించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి, భారత జట్టు స్కోరును 253 పరుగుల భారీ లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో అత్యంత కీలకమైన సమయంలో బరిలోకి దిగి, ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, సామ్ కరన్‌ల వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ గెలుపు దిశగా సాగుతున్న సమయంలో హార్ధిక్ వేసిన పెనాల్టీ ఓవర్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది.
'ఆ కుర్రాడిలో ధైర్యం ఉంది'
41 ఏళ్ల డుప్లెసిస్ మాట్లాడుతూ, కోచ్‌లు ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు కేవలం టాలెంట్‌ను మాత్రమే కాకుండా, వారిలో ఉన్న 'ధైర్యాన్ని' డా చూస్తారని వివరించాడు హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఒత్తిడి పెరిగే కొద్దీ మరింత మెరుగ్గా రాణిస్తారని.. అటువంటి ధైర్యం, క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతారని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.
విజేతగా భారత్
2024 వరల్డ్ కప్‌లోనూ భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు 2026లో కూడా అదే జోరును కొనసాగిస్తూ టీమిండియాకు ప్రధాన ఆయుధంగా మారాడు. ఈ సెమీఫైనల్ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. హార్దిక్ పాండ్యా ప్రదర్శన అభిమానులకు, మాజీ ఆటగాళ్లకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.