For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఫైనల్ చేరదు: ట్రోల్ చేసినా బుద్ధి రాలేదు బాబోయ్! (వీడియో)

టీ20 ప్రపంచకప్2026 నాకౌట్ దశకు చేరుకోవడంతో క్రికెట్ ఫీవర్ పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ టీమిండియాపై చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఆమిర్ చేసిన అంచనాలు తప్పి ట్రోలింగ్‌కు గురైనప్పటికీ.. సెమీఫైనల్‌కు ముందు ఆయన మళ్లీ టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడటం చర్చనీయాంశమైంది.

సూపర్-8 దశలో వెస్టిండీస్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడకముందు.. మహమ్మద్ ఆమిర్ ఓ పాకిస్థానీ చర్చా వేదికపై మాట్లాడుతూ.. భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేదని నమ్మకంగా చెప్పాడు. వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోతుందని.. టోర్నీ నుంచి వైదొలుగుతుంది ఆయన జోస్యం చెప్పాడు. అయితే సంజూ శాంసన్(97*) తన అసాధారణ ఆటతీరుతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో మహమ్మద్ ఆమిర్ అంచనా తప్పడమే కాకుండా, నెటిజన్లు ఆయన్ను ఒక రేంజ్‌లో ఆడుకున్నారు.

Mohammad Amir Predicts India Will Lose T20 World Cup Semi-Final vs England Despite Recent Wins

మళ్లీ వివాదాస్పద జోస్యం
తన అంచనా తప్పినప్పటికీ.. మహమ్మద్ తన విమర్శనాత్మక ధోరణిని మార్చుకోలేదు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. ఈసారి భారత్ ఫైనల్‌కు చేరదని బల్లగుద్ది చెప్పాడు. తన విశ్లేషణ ప్రకారం.. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లెవరూ ఫామ్‌లో లేరని, ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నారని ఆమిర్ పేర్కొన్నాడు. అలాగే భారత బ్యాటింగ్ ప్రతి మ్యాచ్‌లోనూ తడబడుతోందని.. ఇలాంటి ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను ఓడించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

భారత్ vs ఇంగ్లాండ్: సెమీఫైనల్ హ్యాట్రిక్ పోరు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్‌లో తలపడటం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2022లో జరిగిన సెమీస్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేయగా.. 2024లో భారత్ 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు 2026లో ముంబై వేదికగా జరుగుతున్న ఈ మూడో పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాకు, హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టుకు మధ్య ఈ మ్యాచ్ ఒక అగ్నిపరీక్షలా మారనుంది.

వాంఖడే సాక్షిగా గట్టి సమాధానం దొరుకుతుందా?
గతంలో మహమ్మద్ చేసిన అంచనాలను భారత్ తన ఆటతీరుతో పదే పదే తుత్తునియలు చేసింది. ఇప్పుడు వాంఖడే స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి, ఫైనల్‌కు దూసుకెళ్లడం ద్వారా ఆమిర్‌కు మరోసారి గట్టి సమాధానం ఇవ్వాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. విమర్శలు ఎలా ఉన్నా, మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మరి అమీర్ అంచనా నిజమవుతుందా? లేక భారత్ మరోసారి ఆయన మాటలను తప్పు అని నిరూపిస్తుందా? అన్నది వేచి చూడాలి.

Story first published: Tuesday, March 3, 2026, 13:14 [IST]
Other articles published on Mar 3, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+