న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది భారత్‌కు ప్రతికూలాంశమే: పాక్ మాజీ క్రికెటర్

Waqar Younis says India will feel Rohit, Ishant Sharmas absence against Australia

కరాచీ: భారత్-ఆస్ట్రేలియా సిరీస్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పుడు చర్చంతా ఈ సిరీస్ గురించే జరుగుతుంది. రెండూ బలమైన జట్లు కావడంతో వీటి మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్‌ వకార్ యూనిస్‌ కూడా టెస్టు సిరీస్‌ గురించి తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా విశ్లేషించాడు. 2018లో స్వదేశంలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ కోల్పోవడంతో ఈ సారి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు ప్రయత్నిస్తుందని అన్నాడు.

పటిష్టంగా ఆసీస్..

పటిష్టంగా ఆసీస్..

‘మెరుగైన పేస్ దళంతో పాటు డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్ జట్టులో ఉండటంతో ఆసీస్ పటిష్టంగా కనిపిస్తోంది. పైగా స్వదేశంలో మ్యాచ్‌‌లు జరుగుతుండటం ఆ జట్టుకు అదనపు ప్రయోజం చేకూరనుంది. అయితే భారత జట్టులోనూ మేటి ఆటగాళ్లున్నారు. ప్రత్యర్థి పతానాన్ని శాసించే గొప్ప బౌలర్లు ఆ జట్టు సొంతం. గత పర్యటనలో వాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె వంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ కూడా ఉండటంతో ఇరు జట్లు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది' అని వకార్ అభిప్రాయపడ్డాడు.

ఆ ముగ్గురు లేకపోవడం..

ఆ ముగ్గురు లేకపోవడం..

టీమిండియా విరాట్ కోహ్లీ గైర్హాజరీతో పాటు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు జట్టుకు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశమని ఈ పాక్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ‘రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్‌మన్‌, ఇషాంత్ శర్మ తన అనుభవంతో వికెట్లు సాధించగలడు. టెస్టుల్లో వాళ్లు లేకపోవడం టీమిండియాకు లోటే. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముగ్గురు లేకపోవడం భారత జట్టు'' అని వకార్‌ అన్నాడు.

కఠినమైన నిబంధనలు..

కఠినమైన నిబంధనలు..

పెటర్నిటీ లీవ్ మీద కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమెకు అండగా ఉండేందుకు విరాట్ తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రానున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించని రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కూడా తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్‌ నిబంధనలు, గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో వారిద్దరు చివరి టెస్టులకు కూడా అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.

India vs Australia: ఫిలిప్ హ్యూస్ వర్దంతి నాడే ఫస్ట్ వన్డే.. నివాళులర్పించనున్న ఇరు జట్ల ఆటగాళ్లు!

Story first published: Wednesday, November 25, 2020, 20:00 [IST]
Other articles published on Nov 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X