Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ఫిలిప్ హ్యూస్ వర్దంతి నాడే ఫస్ట్ వన్డే.. నివాళులర్పించనున్న ఇరు జట్ల ఆటగాళ్లు!

India and Australia players to pay homage to phillip Hughes ahead of 1st ODI

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాల మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజు( 2014 నవంబర్ 25)న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో రాకాసి బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడ్డ హ్యూస్ రెండు రోజుల అనంతరం తుదిశ్వాస విడిచాడు. అతని మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది.

షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్ హ్యూస్.. ఓ రాకాసి బౌన్సర్‌కు నేలకూలాడు. హెల్మెట్ ధరించినా.. బంతి అతని ఎడమ చెవి కింది భాగంలో బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా.. రెండు రోజుల అనంతరం నవంబర్ 27న మరణించాడు. 26వ బర్త్‌డేకు సరిగ్గా మూడు రోజుల ముందే హ్యూస్ ఈ లోకం వీడాడు.

అయితే హ్యూస్ 6వ వర్దంతి నాడే భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. దాంతో హ్యూస్‌కు ఇరు జట్ల ఆటగాళ్లు ఘన నివాళ్లులర్పించనున్నారు. హ్యూస్ చివరి మ్యాచ్‌లో చేసిన 63 పరగులను స్మరించుకుంటూ ఇరు జట్ల ఆటగాళ్లు ఫస్ట్ వన్డే ప్రారంభానికి ముందు 63
సెకండ్ల పాటు మౌనం పాటించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌తో ప్రారంభమయ్యే సుదీర్ఘ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్ట్‌లు ఆడనున్నాయి.

Story first published: Wednesday, November 25, 2020, 18:22 [IST]
Other articles published on Nov 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+