న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ సింగ్ ఓ పోరాటయోధుడు.. చావునైనా లెక్కచేయని ఫైటర్: లక్ష్మణ్

VVS Laxman pays tribute to 2011 Yuvraj Singhs unwavering spirit

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ పోరాటయోధుడు.! చావునైనా లెక్కచేయని ఫైటర్.! అవును 2011 ప్రపంచకప్‌లో భారత్‌ విజయాల బాటలో ఉన్న సమయంలోనే తనకు క్యాన్సర్‌ వచ్చిందనే సంగతి యువరాజ్‌కు తెలుసు. కానీ తాను చనిపోయినా సరే, టోర్నీ మధ్యలో మాత్రం వెళ్లిపోనని అతను గట్టిగా చెప్పుకున్నాడు. మరణించాల్సి వస్తే మైదానంలోనే చనిపోతానని నిర్ణయించుకుని టోర్నీ మొత్తం ఆడాడు. కేవలం ఆడడం మాత్రమే కాదు... నాలుగు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లు, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'తో భారత్ 28 ఏళ్ల కలను సాకారం చేశాడు.!

ఇదే విషయాన్ని భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. అతను క్యాన్సర్ జయించిన తీరు, రీఎంట్రీలో సాధించిన సెంచరీ స్పూర్తిదాయకమని కొనియాడాడు.

స్పూర్తిగా నిలిచిన ఆటగాళ్ల గురించి..

భారత జట్టులో తనతో ఆడిన ఆటగాళ్లలో నైపుణ్యాలు, వారి నుంచి ఏం నేర్చుకున్నానో వివరిస్తానని లక్ష్మణ్ వారం క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల, జవగళ్ శ్రీనాథ్‌ల గురించి చెప్పిన ఈ హైదరాబాద్ స్టార్ క్రికెటర్.. ఆదివారం యువరాజ్ సింగ్ గురించి మాట్లాడుతూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

సడలని పట్టుదలకు నిదర్శనం..

సడలని పట్టుదలకు నిదర్శనం..

‘తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ జట్టును తన భుజాలపై మోసాడు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. కోలుకున్న తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చి అతను చేసిన అత్యధిక వన్డే స్కోర్.. యువీ సడలని పట్టుదలకు నిదర్శనం'అని లక్మణ్ ట్వీట్ చేశాడు.

క్యాన్స్‌ర్‌ను జయించిన తర్వాత 2017లో ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 150 విశ్వరూపం చూపించాడు. యువీ ఈజ్ బ్యాక్ అనేలా అద్భుత ఆటతీరు కనబర్చాడు.

స్పేషల్ డే‌గా మార్చవు..

స్పేషల్ డే‌గా మార్చవు..

ఇక లక్ష్మణ్ ట్వీట్‌పై యువీ స్పందించాడు. ‘నా స్టోరీని షేర్ చేసి నాకు ప్రత్యేక రోజుగా మిగిల్చావ్'అని లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే(క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి రోజు)గా జూన్ 7న జరుపుకుంటారు. ఇదే రోజు యువీ స్టోరీని లక్ష్మణ్ షేర్ చేయడం గమనార్హం. ఇక 2019 వన్డే ప్రపంచకప్ జరుగుతుండగానే యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ తీసుకొని అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్ ఆడాడు.

2011 వరల్డ్ కప్ హీరో..

2011 వరల్డ్ కప్ హీరో..

2011 ప్రపంచకప్‌లో 362 పరుగులు, 15 వికెట్లతో యువీ మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రక్తపు వాంతులైనా యువీ వెనక్కి తగ్గలేదు. 51/2 రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అప్పటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి 122 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. కోహ్లీ(59) ఔటైనా తన అద్భుత ఆటతీరుతో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులతో జట్టుకు 268 పరుగుల పోరాడే స్కోర్‌ను అందించాడు. అనంతరం బౌలింగ్‌లో డెవన్ థామన్, ఆండ్రూ రస్సెల్‌ను ఔట్ చేసి భారత్ 80 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన క్రికెట్ కెరీర్‌లో 40 టెస్టులాడిన యువీ 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 రన్స్, 58 టీ20ల్లో 1177 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 148 వికెట్లు తీశాడు.

ధోనీ మాస్టర్ మైండ్.. వివాదాస్పద రీతిలో ఇయాన్ బెల్ రనౌట్!

Story first published: Sunday, June 7, 2020, 20:29 [IST]
Other articles published on Jun 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X