ధోనీ మాస్టర్ మైండ్.. వివాదాస్పద రీతిలో ఇయాన్ బెల్ రనౌట్! మహీని కొనియాడిన బ్రిటీష్ మీడియా!

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన సారథి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మహీని మించినవారు లేరని అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న ప్రతీ క్రికెటర్ చెబుతుంటాడు.
మైదానంలో ధోనీకి శరీరమంతా కళ్లు ఉంటాయని, ముఖ్యంగా ఫీల్డింగ్, బౌలర్లతో వ్యూహాలు రచించి బ్యాట్స్‌మన్ బోల్తా కొట్టించే విషయంలో అతనికి సాటిలేరని ఈ జార్ఖండ్ డైనమైట్ కెప్టెన్సీని కొనియాడుతుంటారు. ఇక మనం కూడా మహీ కెప్టెన్సీ, కీపింగ్ స్కిల్స్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో, మరెన్నో సందర్భాల్లో చూశాం. కానీ భారత్ 2011 ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్ మాత్రం అతని కెప్టెన్సీ కెరీర్‌కే ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. క్రీడా స్పూర్తి విషయంలో యావత్ క్రికెట్ ప్రపంచం ముందు విజేతగా నిలబడి ప్రశంసలు అందుకుంది. ధోనీ.. ఛీటర్ ఛీటర్ అంటూ అరిచిన ఇంగ్లండ్ అభిమానులే నిలబడి ధోనీ హీరో హీరో అంటూ కొనియాడారు.

ఇయాన్ బెల్ వివాదస్పద రనౌట్..
యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ మ్యాచ్ బ్యాట్స్‌మన్ అలసత్వానికి ఓ గుణపాఠంగా నిలిచింది. ముఖ్యంగా ఇయాన్ బెల్ వివాదస్పద రనౌట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రెంట్ బ్రెడ్జ్ వేదికగా జరిగిన నాటి రెండో టెస్ట్ మూడో రోజు ఆట ఓ డ్రామాను తలిపించింది. టీ బ్రేక్ సమయం ముందు ఇషాంత్ శర్మ వేసిన 66వ ఓవర్ చివరి బంతిని నాటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా చక్కటి షాట్ ఆడాడు. దాదాపు బౌండరీ అనుకుంటుండగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ అద్భుత డైవ్‌తో బంతిని అడ్డుకున్నాడు. అయితే అది ఫోరా? కాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ లోపు ఇయాన్ బెల్, మోర్గాన్ మూడు పరుగులు పూర్తి చేశారు. అయితే అది టీ బ్రేక్ ముందు బంతి కావడం.. బౌండరీ పోయిందనే అలసత్వంతో ఇయాన్ బెల్ మూడో పరుగు తర్వాత నాలుగో రన్ కోసం సగం క్రీజు వరకు పరుగెత్తుకొచ్చి ఆగిపోయాడు.
ధోనీ మాస్టర్ మైండ్..
ఇక బంతిని అందుకున్న ధోనీ తెలివిగా స్టంప్స్‌ను కొట్టి అప్పీల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో అయోమయం చోటుచేసుకుంది. అంపైర్లకు కఠిన సవాల్ ఎదురైంది. ముందుగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయంతో బంతి బౌండరీనా? కాదా? అని పరీక్షించారు. బంతి బౌండరీ వెళ్లలేదని తేలడంతో.. భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారా? లేదా ? అని పరీక్షించారు. వారు అప్పీల్ చేయడంతో మరోసారి ధోనీని ప్రశ్నించారు. అతను అప్పీల్ వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో నిబంధనల మేరకు ఇయాన్ బెల్‌ను రనౌట్‌గా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంతో అవాక్కైన ఇయాన్.. ఓవర్ పూర్తయిందనే మాట విన్నానని, బెయిల్స్ కిందపడేయంతోనే ఆగిపోయానని అంపైర్లకు తెలుపుతూ అసంతృప్తితో మైదానం వీడాడు. ఇక ఇంగ్లండ్ అభిమానులు ఛీటర్స్ ఛీటర్స్ అంటూ పెద్దగా అరిచారు. ఆ అరుపుల మధ్యలో ఆటగాళ్లంతా టీ బ్రేక్‌కు వెళ్లారు.

అప్పీల్ వెనక్కి..
ఇక టీ బ్రేక్ సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటి ఇంగ్లండ్ కోచ్ అండీ ఫ్లవర్, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ లు ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఇయాన్ ఔట్ అప్పీలును ఉపసంహరించుకోవలసిందిగా ధోనీని కోరారు. తొలుత ససేమిరా అన్న ధోనీ.. టీమ్‌తో చర్చించి చెబుతానన్నాడు. జట్టులోని సీనియర్లతో చర్చించిన మహీ
ఇయాన్ బెల్ రనౌట్ అప్పీలును ఉపసంహరించుకున్నాడు. అయితే అప్పీల్‌ను ఉపసంహరించుకోవడానికి ధోనీ ససేమిరా అన్నాడని, సచిన్ చెప్పడంతోనే ఒప్పుకున్నాడని అప్పట్లో బ్రిటీష్ మీడియా పేర్కొంది.

క్రీజులోకి ఇయాన్ బెల్..
అప్పీల్‌ను వెనక్కు తీసుకోవడంతో ఇయాన్ బెల్ క్రీజులోకి అడుగుపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ అభిమానులు ధోనీని కొనియాడారు. క్రీడా స్పూర్తి చాటాడని హీరో అంటూ ప్రశంసించారు. బ్రిటీష్ మీడియా సైతం ధోనీ, భారత జట్టు నిర్ణయాన్ని ప్రశంసించింది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇయాన్ బెల్ అలసత్వమేనని, అతను నిబంధనల మేరకే ఔటయ్యాడని, ధోనీ క్రీడాస్పూర్తి చాటడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయంతో ధోనీ ఐసీసీ స్పిరిట్ క్రికెట్ ఆఫ్ ది అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 319 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇయాన్ బెల్ 159 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
దాదా ఐసీసీ ప్రెసిడెంట్ అయితే నా నిషేధాన్ని ఎత్తేయమంటా: కనేరియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications