రాహుల్ తెవాటియా పట్టిందల్లా బంగారమే.. చాన్స్ ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా కనుగొంటాడు: సెహ్వాగ్

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్, ఐపీఎల్ 2020 స్టన్నింగ్ పెర్ఫార్మర్ రాహుల్ తెవాటియాపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనికి అవకాశమిస్తే కరోనా వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయగలడని తనదైన సెటైర్స్‌తో కొనియాడాడు. ఇప్పటికే తన సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు సంచలన విజయాలందించిన తెవాటియా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు.

స్టన్నింగ్ క్యాచ్..

ఈ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్ వచ్చిన తెవాటియా(11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 19 నాటౌట్) రాణించాడు. అనంతరం బౌలింగ్‌లో పడిక్కల్ వికెట్ తీసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. ఇక అంతటితో ఆగకుండా బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్‌తో విరాట్ కోహ్లీ(43)ని పెవిలియన్ చేర్చాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా విరాట్ భారీ షాట్ ఆడగా.. బంతి దాదాపు సిక్స్‌గా వెళ్లింది. కానీ ఆ దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే సమన్వయం కోల్పోతున్నట్లు గ్రహించిన ఈ రాజస్థాన్ ఆల్‌రౌండర్.. బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి చాకచక్యంగా అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు విరాట్ నిరాశగా వెనుదిరగ్గా.. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసిన రాజస్థాన్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.

పట్టిందల్లా బంగారమే..

పట్టిందల్లా బంగారమే..

ఇక ఈ క్యాచ్‌కు ఫిదా అయిన సెహ్వాగ్ రాహుల్ తెవాటియాను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో అతను పట్టిందల్లా బంగారమే అవుతుందనే అర్థంలో తనదైన శైలిలో ప్రశంసించాడు. ‘తేవాటియా ఏదైనా చెయగలడు. ఆఖరికి తనకు అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయగలడు. అద్భుతమైన క్యాచ్'అంటూ సెహ్వాగ్ హిందీలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో తేవాతియా సూపర్ క్యాచ్ ఫొటోను కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక తెవాటియా క్యాచ్‌పై యువరాజ్ సింగ్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.

ఏబీడీ విధ్వంసం..

ఏబీడీ విధ్వంసం..

దాదాపు గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌కు నిరాశే ఎదురైంది. ఏబీ డివిలియర్స్ (22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ అద్భుత విజయాన్నందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 ), రాబిన్ ఊతప్ప (22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 41) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. ఏబీడీకి తోడుగా విరాట్ కోహ్లీ(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 43), దేవదత్ పడిక్కల్( 37 బంతుల్లో 2 ఫోర్లతో 35) రాణించారు.

ఇది మింగుడు పడని పరిస్థితి.. ఏబీడీ ముందు పెద్ద బౌండరీలు కూడా చిన్నబోయాయి: స్మిత్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 17, 2020, 21:44 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X