న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని అయితే సూపర్ ఓవర్ బుమ్రాతో వేయించేవాడు కాదు : సెహ్వాగ్

Virender Sehwag Says MS Dhoni Would Not Have Selected Jasprit Bumrah for Super Over

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లోపాలను ఎత్తిచూపుతున్న టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోమారు విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా మూడో టీ20లో కోహ్లీ చేసిన తప్పిదాలను ఎండగట్టాడు. అత్యంత థ్రిల్లింగ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ ఈ మ్యాచ్ విజయంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

విలియమ్సన్ అత్యుత్సాహం.. సెంచరీతో పాటు విజయం దూరం!!విలియమ్సన్ అత్యుత్సాహం.. సెంచరీతో పాటు విజయం దూరం!!

కోహ్లీ తప్పిదం..

కోహ్లీ తప్పిదం..

అయితే ఈ సూపర్ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రాతో బౌలింగ్ చేయించడం కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన తప్పిదమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆ రోజు నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 45 పరుగులిచ్చి అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి కాకుండా ఆరోజు బాగా బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజా,యుజువేంద్ర చాహల్‌తో వేయించాల్సిందన్నాడు. ధోని కెప్టెన్‌గా ఉంటే ఖచ్చితంగా జడేజాతోనే సూపర్ ఓవర్ వేయించేవాడని చెప్పుకొచ్చాడు.

‘ఇలాంటి పరిస్థితుల్లో ధోని కనుక కెప్టెన్‌గా ఉండి ఉంటే అతను కచ్చితంగా బుమ్రాతో సూపర్ ఓవర్ బౌలింగ్ చేయించేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఈ విషయం బుమ్రాకు కూడా తెలుసు. కానీ.. అతనితోనే సూపర్ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్ చేయించడం కోహ్లీ తెలివైన నిర్ణయం కాదు. బుమ్రాతో కాకుండా చహల్, జడేజాలతో సూపర్ ఓవర్ వేయింంచాల్సింది. ఇక ధోని అయితే కచ్చితంగా జడేజాతోనే బౌలింగ్ చేయించేవాడు. అతనైతే 16 పరుగులు కాకుండా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చేవాడు. ఈ విషయంలో నేను గ్యారంటీ ఇవ్వగలను.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్లు వేసి 23 పరుగులే ఇచ్చాడు.

అదే మా కొంప ముంచింది: విలియమ్సన్

ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు:

ఎన్నో రోజులు గుర్తుంచుకోవచ్చు:

ఈ గెలుపు నమ్మశక్యం కానిదని, ఈ విజయాన్నందించిన రోహిత్‌, షమీలపై సెహ్వాగ్ ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. 'అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు రోహిత్‌ కచ్చితంగా సరిపోతాడు. షమీ 4 బంతుల్లో 2 పరుగుల్ని కాపాడటం నమ్మశక్యం కానిది' అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ కొనియాడాడు.

కోహ్లీ కెప్టెన్సీపై పరోక్ష వ్యాఖ్యలు

కోహ్లీ కెప్టెన్సీపై పరోక్ష వ్యాఖ్యలు

జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనికి ఉన్న స్పష్టత మరెవరికీ ఉండేది కాదని, ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసని కోహ్లీ కెప్టెన్సీని ఉద్దేశించి సెహ్వాగ్ ఇటీవల పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో ఐదోస్థానంలో కేఎల్ రాహుల్‌ బరిలోకి దిగి విఫలమైయితే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలవదని, కానీ ధోని హయాంలో అలా ఉండేది కాదన్నాడు.‘ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఓ నాలుగుసార్లు విఫలమైతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే అతని బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తుంది. కానీ ధోని మాత్రం ఇలా చేసేవాడు కాదు. అలాంటి స్థితిలో ఆటగాళ్లకు మద్దతివ్వడం ఎంతో ముఖ్యమో అతనికి బాగాతెలుసు. అందుకే వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించేవాడు'అని ఈ డాషింగ్ ఓపెనర్ తెలిపాడు.

Story first published: Friday, January 31, 2020, 13:10 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X