For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ విన్నర్‌కు బెంచే గతి.. టీమిండియాలో వార్!

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు వరుణ్ చక్రవర్తిని ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగిస్తోంది. ఈ కీలక టోర్నీలో వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచినప్పటికీ.. అతని ఎకానమీ రేటు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సూపర్-8 దశ నుంచి వరుణ్ చక్రవర్తి ఓవర్‌కు సగటున 11 పరుగులకు పైగా సమర్పించుకుంటున్నాడు. వరుణ్ తీసిన వికెట్లలో సగానికి పైగా అసోసియేట్ దేశాలపై వచ్చినవే కావడం గమనార్హం. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతనికే మొగ్గు చూపుతోంది.

కుల్దీప్ యాదవ్ ఎందుకు బెంచ్‌కే పరిమితం?
మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లపై కూడా వరుణ్‌కే ప్రాధాన్యత ఇస్తుండటం చర్చనీయాంశమైంది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారతీయుడిగా రికార్డు సృష్టించిన కుల్దీప్‌కు, కేవలం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అవకాశం దక్కడం కుల్దీప్ పట్ల జరుగుతున్న అన్యాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Kuldeep Yadav vs Varun Chakaravarthy Why is the T20 World Cup Winner Benched in 2026

ముందంజలో కుల్దీప్
కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి టీ20 రికార్డులను పరిశీలిస్తే కుల్దీప్ అన్ని విభాగాల్లోనూ ముందున్నాడు. కుల్దీప్ 54 మ్యాచ్‌లలో 95 వికెట్లు తీయగా.. అతని ఎకానమీ 6.95, సగటు 13.74గా ఉంది. వరుణ్ చక్రవర్తి 44 మ్యాచ్‌లలో 72 వికెట్లు తీసి, 7.45 ఎకానమీ, 16.30 సగటు కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ విషయంలో కూడా కుల్దీప్ (11.8) వరుణ్ (13.1) కంటే మెరుగైన స్థానంలో ఉన్నాడు. 5 వికెట్ల ప్రదర్శనలోనూ కుల్దీప్ రెండుసార్లు ఈ ఘనత సాధించి పైచేయి సాధించాడు.

మెగా టోర్నీల్లో ప్రదర్శన
గత ఆసియా కప్ 2025లో ఈ ఇద్దరూ కలిసి ఆడినప్పుడు కూడా కుల్దీప్ 17 వికెట్లతో టోర్నీలోనే టాప్ బౌలర్‌గా నిలిచాడు. వరుణ్ కేవలం 7 వికెట్లకే పరిమితమయ్యాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రను చూసినా కుల్దీప్ యావరేజ్ (13.90), ఎకానమీ (6.65) వరుణ్ కంటే (యావరేజ్ 24.53, ఎకానమీ 8.18) ఎంతో మెరుగ్గా ఉన్నాయి. 2024 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన కుల్దీప్‌ను కాదని.. ఎక్కువ పరుగులు ఇస్తున్న వరుణ్‌ను ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఆడించడం సాహసమే అవుతుంది.

న్యూజిలాండ్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ పరిస్థితులను బట్టి టీమిండియా తన స్పిన్ విభాగాన్ని ఎలా ఎంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేవలం వికెట్ల సంఖ్యను చూసి వరుణ్‌ను కొనసాగిస్తారా లేదా అనుభవం, నిలకడ ఉన్న కుల్దీప్‌ను బరిలోకి దించుతారా అనేది చూడాలి.

Story first published: Friday, March 6, 2026, 14:02 [IST]
Other articles published on Mar 6, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+