నటరాజన్‌ను పంజాబ్ జట్టులోకి తీసుకుంటే తిట్టారు: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag - 'Everyone Questioned When I Picked T Natarajan For Kings XI Punjab'

న్యూఢిల్లీ: తమిళనాడు ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్‌ టి.నటరాజన్‌ భారత జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. అతని సత్తా తెలుసు కాబట్టే ఐపీఎల్‌ 2017 సీజన్‌లో కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌ జట్టులోకి తీసుకున్నానని తెలిపాడు. కానీ.. కనీసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడని నటరాజన్‌ను ఎందుకు తీసుకున్నావని విమర్శకులు తనను విమర్శించాంరని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. నటరాజన్ ప్రతిభను గుర్తించే అతని కోసం వేలంలో భారీ ధరను వెచ్చించానని, పైగా పంజాబ్‌ జట్టులోని తమిళనాడు ఆటగాళ్లు చెప్పడం వల్లే అతన్ని తీసుకున్నానని స్పష్టం చేశాడు.

అందరూ విమర్శించారు.1

అందరూ విమర్శించారు.1

సోనీ స్పోర్ట్స్ చర్చ కార్యక్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ బదులిస్తూ నటరాజన్‌ను ఎంపిక చేసిన తీరును గుర్తు చేసుకున్నాడు. ‘కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు అతడిని తీసుకున్నందుకు నేనెంతో సంతోషించాను. అతను కనీసం దేశవాళీ క్రికెట్‌ అయినా ఆడలేదని అప్పుడు నన్ను విమర్శించారు. కేవలం టీఎన్‌పీఎల్‌ లీగులో ఆటతీరు చూసి అంత భారీ ధర ఎందుకు వెచ్చించావని ప్రశ్నించారు. డబ్బు గురించి నేను బాధపడలేదు. అతనిలో ప్రతిభ ఉందని నమ్మాను. నటరాజన్ అత్భుతమైన బౌలరని, డెత్‌ ఓవర్లలో కట్టు దిట్టంగా యార్కర్లు వేస్తాడని మా జట్టులోని తమిళనాడు ఆటగాళ్లు నాకు చెప్పారు.

గాయంతో ఆడలేకపోయాడు..

గాయంతో ఆడలేకపోయాడు..

దాంతో నేను నటరాజన్‌ వీడియోలు చూశాను. మాకెవరూ డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు లేకపోవడంతో వేలంలో అతన్ని కొనుగోలు చేశాను. దురదృష్టవశాత్తు ఆ ఏడాది అతని మోచేతికి గాయమైంది. దాంతో అన్ని మ్యాచులూ ఆడలేకపోయాడు. కానీ అతను ఆడిన మ్యాచులు మాత్రమే గెలిచి మేం మిగతావి ఓడిపోయాం. నటరాజన్‌ ఆస్ట్రేలియాతో జరిగే టీ20లకు ఎంపికవ్వడంతో అతడికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని కోరుకున్నా. కానీ ఆశ్చర్యంగా ముందుగా వన్డేల్లోనే అరంగేట్రం చేశాడు. ఏదైతేనేం.. అంతా మంచే జరిగింది. ఇలాగే నిలకడగా రాణిస్తూ అతను భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి' అని సెహ్వాగ్‌ ఆకాంక్షించాడు.

 వేలంలో రూ. 3 కోట్లు

వేలంలో రూ. 3 కోట్లు

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన నటరాజన్‌ను 2017 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో నటరాజన్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. కానీ ఆసీజన్‌లో 6 మ్యాచుల్లో 2 వికెట్లే తీసి 115 పరుగులు ఇవ్వడంతో పంజాబ్ నట్టూను వదిలేసింది. అయితే టీఎన్‌పీఎల్‌లో అతని ప్రతిభను గమనించిన సన్‌రైజర్స్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్‌ 2018 వేలంలో రూ.40 లక్షలకు హైదరాబాద్‌ కొనుగోలు చేసేలా కృషిచేశాడు. పూర్తిగా బౌలర్లతో ఉండే హైదరాబాద్‌లో అతనికి అవకాశాలు రాలేదు. 2019 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టి హైదరాబాద్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

యార్కర్ల నట్టూ..

యార్కర్ల నట్టూ..

ఐపీఎల్ 2020 సీజన్‌లో నటరాజన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్ సాధ్యం కానీ విధంగా ఈ సీజన్‌లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో కూడా చివరి ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేసి ప్రత్యర్థి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. నట్టూ బౌలింగ్‌కు యువరాజ్ సింగ్, హర్షాబోగ్లే సైతం ఫిదా అయ్యారు. ఇంతగా రాణించిన అతనికి భారత జట్టులోకి నేరుగా అవకాశం దక్కలేదు. ఫస్ట్ నెట్ బౌలర్‌గా.. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో టీ20లకు.. సైనీ గాయంతో వన్డేలో బ్యాకప్‌గా అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే వికెట్లు తీసి.. టీ20 అరంగేట్రాన్ని కూడా ఖాయం చేసుకున్నాడు.

India vs Australia: ఆ లోటే కోహ్లీసేన వన్డే సిరీస్ ఓటమికి కారణమా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, December 4, 2020, 11:07 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X