న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెత్త బౌలింగ్.. పసలేని బ్యాటింగ్.. టీమిండియాపై సెహ్వాగ్ ఫైర్!

Virender Sehwag criticise ‘listless’ Indian bowling after loss aginst England in fifth Test

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన టీమిండియాపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బౌలింగ్.. పసలేని బ్యాటింగ్‌‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుందని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం అద్భుత ప్రదర్శనతో రికార్డు చేజింగ్ విజయాన్నందుకుందని ప్రశంసించాడు. సోమవారం ముగిసిన రీషెడ్యూల్ టెస్ట్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు రోజుల పాటు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. చివరి రెండు రోజుల్లో మాత్రం పేలవ ప్రదర్శనతో మూల్యం చెల్లించుకుంది.

టాప్-6లో ఇద్దరే ఆడారు..

ఈ క్రమంలోనే టీమిండియా వైఫల్యంపై ట్విటర్ వేదికగా స్పందించిన సెహ్వాగ్.. ఓటమికి గల కారణాలను పాయింట్ ఔట్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ మరీ నీస్సారంగా కనిపించిందన్నాడు. గెలవాలనే కసి బౌలర్లలో కనిపించలేదన్నాడు. 'రికార్డు లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లండ్‌కు అభినందనలు. భారత్ వెంటనే తమ లోపాలను సరిదిద్దుకోవాలి. టాప్ 6 బ్యాట్స్‌మెన్‌లో చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ మినహా అంతా విఫలమయ్యారు. లోయరార్డర్‌లో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌‌మన్ జట్టుకు అవసరం. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ చాలా నిస్సత్తువుగా కనిపించింది'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

బ్యాటింగ్ ఈజీ అన్నట్లు ఆడారు..

బ్యాటింగ్ ఈజీ అన్నట్లు ఆడారు..

ఇప్పటికిప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్ మన్ ఎవరంటే రూట్ పేరే చెబుతానని సెహ్వాగ్ వెల్లడించాడు. సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించడం అద్భుతమని కొనియాడాడు. రూట్ ఓ పరుగుల యంత్రం అంటూ సెహ్వాగ్ ప్రశంసించాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఇంగ్లండ్ జట్టు విజయాన్ని కొనియాడాడు. ఇది ఇంగ్లండ్ ప్రత్యేక విజయమన్న సచిన్.. జానీ బెయిర్ స్టో, జోరూట్ అద్భుత ప్రదర్శనతో బ్యాటింగ్ చాలా సులువని చాటి చెప్పారు. చిరస్మరణీయ విజయాన్నందుకున్న ఇంగ్లండ్‌కు అభినందనలని సచిన్ ట్వీట్ చేశాడు.

కెప్టెన్లతో పాటు రాత కూడా..

కెప్టెన్లతో పాటు రాత కూడా..

ఇరు జట్ల కోచ్‌లు, కెప్టెన్లు మారడంతో పాటు రాత కూడా మారిందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. ఇదో అద్భుత టెస్ట్ మ్యాచ్ అని కొనియాడిన ఈ ఆసీస్ లెజెండ్.. గత కొన్ని నెలలుగా ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్‌లో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని కొనియాడాడు. వాళ్లు చెప్పినట్లుగా చెలరేగుతున్నారని ట్వీట్ చేశాడు. కెవిన్ పీటర్సన్ సైతం ఇదో నూతన జట్టు అని, ఈ జైత్రయాత్రను ఆస్వాదిద్దామని పేర్కొన్నాడు.

చేజారిన సువర్ణావకాశం..

చేజారిన సువర్ణావకాశం..

ఇంగ్లిష్‌ గడ్డపై పరాజయాల పరంపరకు తెరదించి, టెస్టు సిరీస్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని భారత్‌ ఉపయోగించుకోలేకపోయింది. నిరుడు సిరీస్‌ ఆగిపోయినప్పటికి.. ఇప్పుటికి చాలా మారిన ఇంగ్లిష్‌ జట్టు.. ఏకంగా 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 259/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఇంకో వికెట్‌ కోల్పోకుండానే ఛేదన పూర్తి చేసింది. రూట్‌ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 194, 16), 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బెయిర్‌స్టో (114 నాటౌట్‌; 145 బంతుల్లో 154, 16) చివరి రోజు మరింత ధాటిగా ఆడి మిగతా పని పూర్తి చేశారు. వీళ్లిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 269 పరుగులు జోడించారు.

Story first published: Wednesday, July 6, 2022, 10:19 [IST]
Other articles published on Jul 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X