For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారతీయుల ప్రాణాలతో ఆటలా? సన్ రైజర్స్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్!

పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ యాజమాన్యంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ చెల్లించే డబ్బులు భారతీయుల ప్రాణాలు తీస్తాయని మండిపడ్డాడు.ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు అబ్రార్ అహ్మద్‌ను రూ.2.32 కోట్లకు కొనుగోలు చేసింది. హండ్రెడ్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్ పాల్గొంది.

ఆమె స్వయంగా అబ్రార్ అహ్మద్‌‌కు బిడ్ వేసింది. అయితే పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బాయ్‌కట్ చేయాలని పిలుపునిచ్చారు. సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఖాతా తాత్కలికంగా సస్పెండ్ అయ్యేలా రిపోర్ట్స్ కొట్టారు. సన్‌రైజర్స్ లీడ్స్‌లో సన్‌నెట్ వర్క్ వాటా 51 శాతం ఉండగా. మిగతా 49 శాతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొనుగోలు చేసింది.

Sunil Gavaskar Slams SRH Over Financial Ties to Pakistan-Affiliated Entities Claims Don t Fund Terrorism

సన్‌రైజర్స్ నిర్ణయాన్ని తప్పుబట్టిన సునీల్ గవాస్కర్..ఓ ప్రతికకు రాసిన కాలమ్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'ఒక భారతీయ యజమానికి చెందిన ఫ్రాంచైజీ పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేయడంపై వచ్చిన ఆగ్రహం సరైందే. 2000 ముంబై దాడుల తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తొలగించారు. ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడటం లేదు. 2019 పహల్గాం అటాక్ తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. పాకిస్థాన్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బు వారి ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయంగా మారుతుంది. ఆ డబ్బు ద్వారా ఆయుధాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణనష్టానికి దారి తీస్తుంది.

ఇది భారతీయ సంస్థ అయినా.. విదేశీ అనుబంధ సంస్థ అయినా యజమాని భారతీయుడే. అయితే ఆ డబ్బు పరోక్షంగా భారతీయుల ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఒక టోర్నీ గెలవడం భారతీయుల ప్రాణాల కంటే ముఖ్యమా?'అని గవాస్కర్ సన్‌రైజర్స్‌ను ప్రశ్నించాడు.

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించిన ఘటనను కూడా గవాస్కర్ తన కాలమ్‌లో ప్రస్తావించాడు. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి వ్యాఖ్యలను కూడా గవాస్కర్ తప్పుబట్టాడు. వెటోరి న్యూజిలాండ్‌కు చెందినవాడని, భారత-పాకిస్థాన్ మధ్య ఉన్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చని గవాస్కర్ అన్నాడు. అయితే భారతీయ యజమానులు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకుని ఇలాంటి నిర్ణయాలను నివారించాల్సిన బాధ్యత ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, March 16, 2026, 17:03 [IST]
Other articles published on Mar 16, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+