Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్.. SRH తుది జట్టు అంచనా ఇదే!

ఆడింది 13 సీజన్లు.. ఓ సారి ఛాంపియన్‌.. రెండు సార్లు రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో మూడు సార్లు ఆరో స్థానం.. మరో మూడు సార్లు అట్టడుగు స్థానం.. ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది.! చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడం ఆరెంజ్ ఆర్మీకి వెన్నతో పెట్టిన విద్య.! జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్‌లో ఏమాత్రం తేడా ఉండదు.!

టీమ్ బ్యాలెన్స్‌లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో ఇరగదీసి ప్రత్య్రర్థి తలవంచడం సన్‌రైజర్స్ స్టైల్.. దాంతో ధనాధన్ లీగ్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సన్‌రైజర్స్.. నయా సీజన్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ గతేడాది తీవ్రంగా నిరాశపర్చింది. మరీ ఈసారి ఆరెంజ్ ఆర్మీ తమ సత్తా చూపిస్తుందా? 10 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందా.. మరోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా?అనేది చూడాలి.!

SRH Probable Playing XI for IPL 2026 No Guarantee for 13 Crore Signing Liam Livingstone in Overseas Slot

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే ఇందులో 9 మంది అనామక ఆటగాళ్లే కావడంతో ఆ జట్టు అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ జట్టుకు బలహీనంగా మారిన బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

SRH బలాలు

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌, నితీష్ కుమార్‌ రెడ్డిలతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ప్యాట్ కమిన్స్ సారథ్యం జట్టుకు కలిసొచ్చే అంశం. శివాంగ్ కుమార్, జీషన్ అన్సారీ, క్రెయిన్స్ ఫులెట్రాలతో స్పిన్ బలం కూడా ఉంది.

SRH బలహీనతలు..

ప్యాట్ కెప్టెన్సీ గాయంతో ఇబ్బంది పడటం. అతను పాల్గొనడటంపై సందేహాలు ఉండటం. టాపార్డర్ విఫలమైతే రాణించే బ్యాటర్ ఎవరా? అనేది తెలియకపోవడం. మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేయగల ప్రధాన పేసర్ ఎవరా? అనేది తెలియకపోవడం, గుర్తింపు పొందిన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం SRH బలహీనతలుగా ఉన్నాయి.


తుది జట్టులో చోటు ఎవరికంటే..?

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషణ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. పంజాబ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సలీల్ అరోరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది. లేదంటే అనికేత్ వర్మకు బ్యాకప్‌గా ఉపయోగించుకోవచ్చు. భారీ సిక్స్‌లు బాదడం అతని ప్రత్యేకత. రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లివింగ్ స్టోన్ బెంచ్‌కే పరిమితం కావచ్చు.

అతని స్థానంలో నాలుగో ఓవర్‌సీస్ ప్లేయర్‌గా ఇషాన్ మలింగా, జాక్ ఎడ్వర్డ్స్‌లో ఒకరికి చోటు దక్కుతుంది. స్పిన్ ఆల్‌రౌండర్ శివాంగ్ కుమార్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. చైనామన్ బౌలర్ అయిన అతను కీలకం కానున్నాడు. పేసర్లుగా కమిన్స్, హర్షల్ పటేల్‌తో పాటు అనామక పేసర్ ప్రఫుల్ హింగే‌కు అవకాశం దక్కనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, శివాంగ్ కుమార్‌, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ/క్రెయిన్స్ ఫులెట్రా, ప్రఫుల్ హింగే/జయదేవ్ ఉనాద్కత్, జాక్ ఎడ్వర్డ్స్‌/ఇషాన్ మలింగా/ లియామ్ లివింగ్ స్టోన్

ఇంపాక్ట్ సబ్: అనికేత్ వర్మ/సలీల్ అరోరా

Story first published: Monday, March 16, 2026, 16:09 [IST]
Other articles published on Mar 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+