Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తెలుగు సినిమా నా ఆల్‌టైమ్ ఫేవరేట్: అభిషేక్ శర్మ

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలియజేశాడు. ఆదివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న అభిషేక్ శర్మ.. సహచర ఆటగాళ్లతో కలిసి హోస్ట్ హర్షా భోగ్లా నిర్వహించిన చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా ఫేవరేట్ మూవీ ఏంటి అని హర్ష భోగ్లే అడగ్గా.. త్రీ ఇడియట్స్ అని అభిషేక్ శర్మ బదులిచ్చాడు. త్రీ ఇడియట్స్ సినిమాను ఎప్పుడూ చూసినా ఆస్వాదిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. త్రీ ఇడియట్స్ సినిమాను స్నేహితుడు పేరిట శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలోకి రీమెక్ చేసిన సంగతి తెలిసిందే.

చదువు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు కాదని.. 'జ్ఞానం కోసం వెతకాలి, అప్పుడే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది' అని త్రీ ఇడియట్స్ సినిమా చాటిచెప్పింది. అమీర్ ఖాన్ అద్భుత నటన, స్నేహం, విద్యావ్యవస్థపై సెటైర్లతో సాగే ఈ మూవీ ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన మాస్టర్ పీస్.

SRH Star Abhishek Sharma Names His Favorite Telugu Hero at BCCI Naman Awards
Photo Credit: screen grab for JioHotstar

హర్ష భోగ్లే: మీ క్రికెట్ ఐడెల్ ఎవరు?

అభిషేక్ శర్మ: యువరాజ్ సింగ్

సంజూ శాంసన్: సచిన్ టెండూల్కర్

హార్దిక్ పాండ్యా: వసీం జాఫర్

వైభవ్ సూర్యవంశీ: బ్రియాన్ లారా, యువరాజ్ సింగ్

హర్ష భోగ్లే: మొదటి వీడియో గేమ్ ఏంటి..?

అభిషేక్ శర్మ: క్రికెట్ 07 ఈఏ స్పోర్ట్స్

సంజూ శాంసన్: GTA Vice City

హార్దిక్ పాండ్యా: డబ్ల్యూడబ్ల్యూఈ

వైభవ్ సూర్యవంశీ: క్రికెట్

హర్ష భోగ్లే: మీరు మొదటగా ఉపయోగించి కారు, బైక్ ఏంటి ..?

అభిషేక్ శర్మ: స్కూటీ.. యాక్టివా. గ్రౌండ్‌కు వెళ్లేవాడిని.

సంజూ శాంసన్: వ్యాగ్నర్

హార్దిక్ పాండ్యా: మారుతీ 800

వైభవ్ సూర్యవంశీ: నేను ఇంకా ఏది వాడలేదు.

హర్ష భోగ్లే: నువ్వు మొదటిసారి స్టేడియం‌లో మ్యాచ్ ఎప్పుడు చూశావ్?

సంజూ శాంసన్: నా మొదటి ఐపీఎల్‌లోనే అంతర్జాతీయ స్టేడియం తొలిసారి మ్యాచ్ చూశాను

హర్ష భోగ్లే: ఫేవరేట్ మూవీ, హీరో ఎవరు?

అభిషేక్ శర్మ: 3 ఇడియట్స్.. ఈ మూవీని ఎప్పుడూ చూసినా ఆస్వాదిస్తాను. ఫేవరేట్ హీరో అనేది మారుతూ ఉంటుంది. సినిమాను బట్టి ఉంటుంది.

సంజూ శాంసన్: రజనీకాంత్ సర్ ఏ మూవీ అయినా నాకు ఇష్టమే.

హార్దిక్ పాండ్యా: Godzilla మూవీ ఇష్టం. ఫేవరేట్ హీరో లేడు.

వైభవ్ సూర్యవంశీ: ధురంధర్.

Story first published: Monday, March 16, 2026, 12:04 [IST]
Other articles published on Mar 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+