న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాకుల్లేవ్.. అదే మా కొంప ముంచింది : విరాట్ కోహ్లీ

Virat Kohli Say India lost because of a poor execution of plans vs New Zealand

క్రైస్ట్‌చర్చ్: వ్యూహాలను సరిగ్గా అమలు పరచకపోవడం, బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. న్యూజిలాండ్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 7 వికెట్లతో ఓడిన భారత్ సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌లో బౌలర్లు అందించిన సహకారాన్ని అందిపుచ్చుకోలేకపోయిన భారత బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలయ్యారు. ఫలితంగా టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. రెండు టెస్ట్‌ల్లో తమ బౌలింగ్ బాగుందని, కానీ బ్యాటింగ్‌లోనే విఫలమై ఓటమి పాలయ్యామన్నాడు. అలాగే ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యామని తెలిపాడు. న్యూజిలాండ్ వ్యూహాలకు తగ్గట్టు రాణించి విజయాన్నందుకుందని ప్రశంసించాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో..

సెకండ్ ఇన్నింగ్స్‌లో..

‘మేం తొలి ఇన్నింగ్స్‌లో కనబర్చిన పోరాట పటిమను సెకండ్ గేమ్‌లో కొనసాగించలేకపోయాం. ఇక బౌలింగ్‌లో కూడా సరైన ప్రదేశాల్లో బంతులు వేయలేకపోయాం. ఇవే మాపై తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. అలాగే ప్రణాళికలకు తగ్గట్టు కూడా మేం రాణించలేకపోయాం. కానీ న్యూజిలాండ్ మాత్రం తమ వ్యూహాలకు కట్టుబడి విజయాన్నందుకుంది. ఇక మా బౌలర్లలా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఓవరాల్‌గా మా బౌలింగ్ బాగుంది. తొలి టెస్ట్‌లో కూడా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. కొన్ని సార్లు బౌలింగ్ బాగున్నా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ముందడుగు వేయడం తప్పా మనం చేసేదేం ఉండదు. కానీ గెలిచే అవకాశాన్ని చేజార్చుకోవడమే నిరాశను కలిగించింది.'అని కోహ్లీ తెలిపాడు.

ICC Women's T20 World Cup 2020: సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌

టాస్‌ను సాకుగా చెప్పం..

టాస్‌ను సాకుగా చెప్పం..

ఇక తమ ఓటమికి టాస్ కూడా ఓ కారణమని అందరూ భావించవచ్చు, కానీ తాము మాత్రం దాన్ని సాకుగా చూపించాలనుకోవడం లేదని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘మా ఓటమిలో టాస్ కూడా కీలక పాత్ర పోషించిందని మీరంతా భావించవచ్చు. కానీ మేం దాన్ని సాకుగా చూపించాలనుకోవడం లేదు. టాస్ మాత్రం బౌలర్లకు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చింది. ఓ అంతర్జాతీయ జట్టుగా ప్రతీ మ్యాచ్‌లో మేం రాణించాలని మీరు అనుకోవడంలో తప్పులేదు. విదేశీ సిరీస్‌ల్లో రాణించాలంటే మేం కూడా అలా రాణించాల్సిందే. మా ఓటమిని అంగీకరిస్తున్నాం. ఎలాంటి సాకులు లేవు. గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగడం ఇప్పుడు మా ముందున్న పని. మొత్తానికి ఈ సిరీస్‌లో మేం అనుకున్న విధంగా రాణించలేకపోయాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్ అలవోకగా..

న్యూజిలాండ్ అలవోకగా..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్ధేశించిన 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ 36 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. లాథమ్‌(52), బ్లండెల్‌(55) అర్ధసెంచరీలతో రాణించారు. విలియమ్సన్‌ 5 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు.

అంతకు ముందు 90/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 124 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి(9), రిషభ్‌ పంత్‌(4), మహ్మద్‌ షమీ(5), బుమ్రా(4) స్వల్ప స్కోర్లకు వెనుదిరగడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. రవీంద్ర జడేజా(16) అజేయంగా నిలవగా.. పుజారా(24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌ 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. సౌథీ మూడు, వాగ్నర్, గ్రాండ్ హోమ్ తలో వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 242 పరుగులకు కుప్పకూలగా.. న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Monday, March 2, 2020, 11:24 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X