న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Women’s T20 World Cup 2020: సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌

 ICC Women’s T20 World Cup 2020: England, South Africa qualify for semis

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో 'హ్యాట్రిక్‌' విజయంతో సౌతాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్‌ 'బి' లీగ్‌ మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 17 పరుగులతో పాకిస్తాన్‌పై గెలవగా... ఇంగ్లండ్‌ 46 పరుగులతో వెస్టిండీస్‌ను ఓడించింది. గ్రూప్‌ 'బి'లో తమ నాలుగు లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించింది. సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్‌తో సమంగా నిలిచింది. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ ఈ గ్రూప్‌లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ.. మంగళవారం వెస్టిండీస్-సౌతాఫ్రికా మధ్య జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌తో గ్రూప్‌ టాపర్‌ ఎవరో తేలనుంది. వెస్టిండీస్‌ను సఫారీలు ఓడిస్తే గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలవనున్నారు. అప్పుడు భారత్ సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కానుంది.

 లారా వోల్వార్ట్‌ హాఫ్ సెంచరీ..

లారా వోల్వార్ట్‌ హాఫ్ సెంచరీ..

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుల బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్‌ (36 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్‌ ) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మారిజన్‌ కాప్‌ (32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌‌తో 31) రాణించింది. అనంతరం 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌‌కు దిగిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్‌ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్‌ (39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా ఫలితం లేకపోయింది.

జడేజా కళ్లు చెదిరే క్యాచ్.. సూపరో సూపర్..!(వీడియో)

 నటాలీ సూపర్ బ్యాటింగ్..

నటాలీ సూపర్ బ్యాటింగ్..

ఇక మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్‌ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్‌ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్‌ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీసింది.

ఆసీస్ vs కివీస్.. సెమీస్ చెరేదెవరూ?

ఆసీస్ vs కివీస్.. సెమీస్ చెరేదెవరూ?

నేటి గ్రూప్‌ ‘ఎ' మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ విజేత ఈ గ్రూప్‌ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్‌ చేరుకుంటుంది. గ్రూప్‌ ‘ఎ'లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకున్న సంగతి తెలిసిందే.

మైదానంలో కోహ్లీ బూతుపురాణం.. ప్రేక్షకుల వైపు అసభ్య సైగలు!! (వీడియో)

Story first published: Monday, March 2, 2020, 8:22 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X