న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

Virat Kohli’s poor form continues, faces heat for wasting review

క్రిస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కూడా కోహ్లీ (3) దారుణంగా విఫలమయ్యాడు. టీమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన కోహ్లీ.. ఏ మాత్రం ఆలోచించకుండా డీఆర్‌ఎస్ సమీక్షకు వెళ్లాడు. అయితే అతడు తీసుకున్న ఈ నిర్ణయమే అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

రివ్యూ వృథా చేశావ్..

అది ఔట్‌ అని స్పష్టంగా తెలుస్తున్నా, ఎందుకు రివ్యూ తీసుకున్నావని, అనవరంగా ఓ రివ్యూను వృథా చేశావని కోహ్లీపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరు అది ఔటనే చెబుతారని, అది అంత క్లోజ్‌డ్ కాల్ కూడా కాదంటున్నారు. ఆ ఔట్‌కు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేస్తున్నారు.

కోహ్లీ ఎప్పుడింతే..

ఇక 2016 నుంచి రివ్యూల విషయంలో కోహ్లీ తడబుతున్నాడు. టెస్ట్‌ల్లో ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ 14 సార్లు రివ్యూలు కోరితే రెండు సార్లు మాత్రమే సక్సెస్‌ అయ్యాడు. బ్యాట్స్‌మన్‌‌గా కోహ్లీ కోరిన 14లో 9 వ్యతిరేకంగా రాగా, మూడు అంపైర్స్‌ కాల్స్‌ అయ్యాయి. ఇక రెండు మాత్రమే కోహ్లికి అనుకూలంగా వచ్చాయి. చివరిసారి 2017-18 సీజన్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులో మాత్రమే కోహ్లికి అనుకూలంగా నిర‍్ణయం వచ్చింది. ఒక కెప్టెన్‌గా డీఆర్‌ఎస్‌లను కోరడంలో విఫలమవుతున్న కోహ్లీ.. ఆటగాడిగా కూడా రివ్యూల విషయంలో వైఫల్యం చెందుతున్నాడు.

మరోసారి మెరిసిన షెఫాలీ.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

కెప్టెన్ అయితే.. రివ్యూకు వెళ్తావా?

అయితే తన రివ్యూ గణంకాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ ఈ రన్‌మిషెన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘క్రికెట్‌ అనేది టీమ్ గేమ్‌.. కోహ్లీది ఒక్కడిదే కాదు. జట్టు గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని ఒకరు.. ‘టెస్టుల్లో తన ఎల్బీ నిర్ణయాల్లో 15 శాతం మాత్రమే సక్సెస్‌ అయిన విషయాన్ని కోహ్లి గుర్తించుకోవాలి' అని ఇంకొకరు.. ‘ కెప్టెన్‌గా అధికారం ఉందని జట్టు ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి డీఆర్‌ఎస్‌ నిర్ణయాలను తీసుకుంటావా?' అని మరొకరు మండిపడ్డారు. అతను వరుసగా విఫలమవడంతోనే విమర్శకులు కోహ్లీపై మాటల దాడికి దిగుతున్నారు. ఆఖరికి ఐసీసీ కూడా గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ చేసిన పరుగులంటూ 3, 19, 2, 9, 15 కోహ్లీని ట్రోల్ చేసింది. వీటన్నిటికి విరాట్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాల్సి ఉంది.

సమష్టి వైఫల్యం..

సమష్టి వైఫల్యం..

న్యూజిలాండ్ యువ బౌలర్ కైలీ జెమీసన్ కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లతో చెలరేగడంతో టెస్ట్ నెంబర్ వన్ జట్టైన భారత్ 63 ఓవరల్లో 242 పరుగులకే కుప్పకూలింది. యువ ఓపెనర్ పృథ్వీషా(54), చతేశ్వర్ పుజారా(54), హనుమ విహారీ (55) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందుకుంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. ఓపెనర్లు టామ్ లాథమ్ (27 బ్యాటింగ్), టామ్ బండెల్(29 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి 14.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. స్వింగ్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్ధి పేసర్లు చెలరేగగా.. భారత బౌలర్లు మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయారు.

Story first published: Saturday, February 29, 2020, 14:14 [IST]
Other articles published on Feb 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X