For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి మెరిసిన షెఫాలీ.. శ్రీలంకపై భారత్ ఘన విజయం

ICC Womens T20 World Cup: India beat Sri Lanka to finish unbeaten in Group A

మెల్‌బోర్న్: ఓవైపు న్యూజిలాండ్ గడ్డపై వరుస పరాజయాలతో భారత పురుషుల జట్టు తడబడుతుండగా.. మరోవైపు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళలు తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో నాకౌట్ చేరిన హర్మన్ ప్రీత్ సేన.. శ్రీలంకతో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్ రాధాయాదవ్(4/23) రఫ్ఫాడించగా.. బ్యాటింగ్‌లో యువ సంచలనం షెఫాలీ(47) మెరుపులు మెరిపించింది. ఫలితంగా భారత్ సునాయస విజయాన్నందుకొని గ్రూప్-ఎ టాపర్‌గా సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

రాణించిన రాధ.. శ్రీలంక 113/9

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ చమరి ఆటపట్టు(33), కవిశ దిల్‌హరి(25 నాటౌట్) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలింగ్‌లో రాధా యాదవ్‌ 4, రాజేశ్వర్ గైక్వాడ్ 2 దీప్తీ శర్మ, శిఖా పాండే, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు.. 14.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి 32 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకున్నారు. భారత బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ(47) మరోసారి మెరుపులు మెరిపించగా.. స్మృతి మంధాన(17), హర్మన్ ప్రీత్ కౌర్(15) విఫలమయ్యారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్), దీప్తీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో ఉదేశిక, సిరివర్థనే తలో వికెట్ తీశారు.

షెఫాలీ మెరుపులు..

114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు యువ సంచలనం షెఫాలీ వర్మ, స్మ‌తి మంధాన అదిరే ఆరంభాన్నిచ్చారు. బౌండరీలతో విరుచుకుపడుతూ తొలి వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో మంధాన ఔటైనా.. క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్‌ కౌర్(15)తో షెఫాలీ చెలరేగింది. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.

హర్మన్ మళ్లీ విఫలం..

భారీ సిక్సర్‌తో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన హర్మన్.. ఆ జోరును కొనసాగించలేకపోయింది. 14 బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసిన హర్మన్.. సిరివర్ధనే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. ఈ మెగాటోర్నీలో హర్మన్ ఇప్పటివరకు తనదైన ప్రదర్శన కనబర్చలేకపోయింది.

షెఫాలీ రనౌట్..

ఇక హర్మన్ ఔటైనా.. షెఫాలీ మాత్రం వెనకడుగు వేయలేదు. భారీ షాట్లతో హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లింది. కానీ క్రీజులోకి వచ్చి జెమీమాతో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(15 నాటౌట్), జెమీమా(15 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్‌కు సునాయస విజయాన్నందించారు.

Story first published: Saturday, February 29, 2020, 12:53 [IST]
Other articles published on Feb 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+