న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఆ చిరు నవ్వు: విరాట్ కోహ్లీ

Virat Kohli Reveals Why he was Left With a Puzzling Smile After Getting Out For his Golden Ducks

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. ఎన్నడూ లేని విధంగా గోల్డెన్ డక్స్ అవుతున్నాడు. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా ఆరుసార్లు డకౌటవ్వగా.. అందులో 3 సార్లు ఈ సీజన్ లోనే చోటు చేసుకోవడం విశేషం. వరుసగా రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయిన కోహ్లీ..ఔటైన ప్రతిసారి ముఖంలో ఒకరకమైన నవ్వుతో పెవిలియన్ చేరుతున్నాడు. అయితే కోహ్లీ వైరాగ్యం తో అలా నవ్వుతున్నాడా..? నిస్సహాయతా..? అనేది అతడి అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే తాజాగా ఆ చిరు నవ్వు వెనుక ఉన్న అసలు కారణాన్ని విరాట్ తెలియజేశాడు.

మూడు డక్స్ పెంచుకున్నావా?

మూడు డక్స్ పెంచుకున్నావా?

పంజాబ్ కింగ్స్‌తో తదుపరి మ్యాచ్ నేపథ్యంలో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ మిస్టర్ నాగ్ చేత విరాట్ కోహ్లీతో ఇంటర్వ్యూ చేయించింది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా విరాట్ తన ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోలో నాగ్.. 'విరాట్ మీకు పెట్స్ అంటే ఇష్టమా..?'అని ప్రశ్నించగా.. కోహ్లీ స్పందిస్తూ.. 'నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం' అని చెప్పాడు. 'మీ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయా..?' అని నాగ్ అడగ్గా 'మాకు అంత టైమ్ లేదు' అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

వైరాగ్యంతోనే..

వైరాగ్యంతోనే..

'మరి ఇటీవల కాలంలో మీరు మూడు బాతు (డక్) లను పెంచుకున్నట్టు అందరూ చూశారు కదా..?' అని ప్రశ్నించాడు. దీనికి పడీ పడీ నవ్విన కోహ్లీ 'నేను గోల్డెన్ డకౌట్ అయిన దాని గురించేగా మీరు మాట్లాడుతున్నది. ఓకే. నా కెరీర్ లో ఇలా (వరుసగా రెండు సార్లు డకౌట్) ఎప్పుడూ జరుగలేదు. అందుకే నేను అప్పుడు వైరాగ్యంతో నవ్వాను. ఇప్పుడు నేను అన్నీ చూస్తున్నాను. నాకు సపోర్ట్ చేసేది ఎవరు.. విమర్శించేది ఎవరు..? అన్నీ తెలుస్తున్నాయి. జీవితంలోని అన్నీ నా అనుభవంలోకి వస్తున్నాయి..'అని విరాట్ చెప్పుకొచ్చాడు. లక్ కలిసిరావడం లేదని బాధపడుతూ కోహ్లీ నవ్వుతున్నాడు.

 వాళ్లకేం తెలుసు నా బాధ..

వాళ్లకేం తెలుసు నా బాధ..

ఇక వీడియోలో తనపై, తన ఆటపై వస్తున్న విమర్శల గురించి కూడా కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'వాళ్లు (విమర్శకులు) నా పరిస్థితుల్లో లేరు. నేనేం భావిస్తున్నానో వాళ్లు అది భావించడం లేదు. నేను ఔట్ అయినప్పుడు పడుతున్న బాధ, వేధన వాళ్లు పడటం లేదు..' అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో 12 మ్యాచులాడిన విరాట్ కోహ్లి.. 19.64 సగటుతో 216 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 58 కాగా.. మూడు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అంతేగాక 3 సార్లు పది కంటే తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు.

Story first published: Wednesday, May 11, 2022, 20:14 [IST]
Other articles published on May 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X