Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. అభిషేక్ సంగతేంటి?

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టును గత సీజన్లో ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్.. వెన్నునొప్పి కారణంగా మొదటి కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. కమిన్స్ ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది.

కమిన్స్‌కు గాయం.. గైర్హాజరుకు కారణం ఇదే!
ప్యాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ గాయం కారణంగానే ఆయన యాషెస్ సిరీస్‌లో కేవలం ఒకే ఒక టెస్టు ఆడాడు. అంతేకాకుండా ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026కు కూడా కమిన్స్ దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ.. ఐపీఎల్ మొదటి కొన్ని మ్యాచ్‌ల వరకు ఫిట్‌నెస్ సాధించడం కష్టమని తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.

SRH Appoints Ishan Kishan as Captain for IPL 2026 Abhishek Sharma Named Vice-Captain Full Details

కెప్టెన్‌గా ఇషాన్.. డిప్యూటీగా అభిషేక్!
ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోయినప్పటికీ.. దేశవాళీ క్రికెట్‌లో ఆయన చూపిన తెగువకు యాజమాన్యం ఫిదా అయ్యింది. ఇటీవలే ఇషాన్ కిషన్ సారథ్యంలో జార్ఖండ్ జట్టు తన తొలి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో హర్యానాపై ఇషాన్ సెంచరీతో చెలరేగి జట్టును విజేతగా నిలబెట్టాడు. ఇషాన్ కిషన్‌కు తోడుగా యువ సంచలనం, లోకల్ బాయ్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల జోడీ జట్టును ముందుండి నడిపిస్తుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

భారత పరిస్థితులపై అవగాహన
ఇషాన్ కిషన్‌కు భారత పిచ్‌లు, పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటం, గత మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేయడం వంటి అంశాలు అతనికి కెప్టెన్సీ దక్కేలా చేశాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా ఇషాన్ అద్భుతంగా రాణించి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

Story first published: Wednesday, March 18, 2026, 17:44 [IST]
Other articles published on Mar 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+