Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 టైటిల్ గెలిచేది ఆ జట్టే: ఏబీ డివిలియర్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ ఆటగాడు మాత్రమే కాదని, ఆ ఫ్రాంచైజీ గుండెచప్పుడని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో జియో హాట్‌స్టార్ షోలో ఆర్‌సీబీ గురించి మాట్లాడిన ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌తో కాకుండా తన ఉనికితో జట్టులో శక్తిని నింపుతాడని, ఆట కోసం అతని చూపే క్రమశిక్షణ అద్బుతమని కొనియాడాడు. కోహ్లీ మైదానంలో చూపించే ఉత్సాహం, గెలుపు కోసం పడే తపన యువ ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నాడు. గతంలో ఆర్‌సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడేదని, కానీ గత సీజన్‌లో జట్టు మొత్తం సమష్టిగా రాణించి విజేతగా నిలిచిందన్నాడు.

Virat Kohli is Still the Heartbeat of RCB AB de Villiers Backs Royal Challengers to Defend IPL Title in 2026

'కోహ్లీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తన ఉనికితో జట్టులో నింపే శక్తి అమోఘం. అతను జట్టును నడిపించే తీరు, క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తుంది. గతంలో ఆర్‌సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడేదని, కానీ 2025లో జట్టు మొత్తం సమిష్టిగా రాణించి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ(657) టాప్ రన్ స్కోరర్‌లలో ఒకడిగా నిలవడమే కాకుండా.. రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, రోమారియో షెపర్డ్ వంటి వారు అద్భుత ప్రదర్శన చేశారు. బంతితో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.

నేను నా జీవితంలో చూసిన అత్యుత్తమ వర్క్ ఎథిక్ కోహ్లీదే. అతను టోర్నమెంట్‌లోకి ఎప్పుడూ పూర్తి సన్నద్ధతతో వస్తాడు. ఒకవేళ అతను రాణించకపోతే అది కేవలం ఫామ్ సమస్య లేదా టెక్నికల్ లోపం వల్లనే అవుతుంది తప్ప, ప్రాక్టీస్ లేక కాదు. విరాట్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈసారి కూడా ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్ నెగ్గే అవకాశం ఉంది.'అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.

Story first published: Thursday, March 19, 2026, 10:14 [IST]
Other articles published on Mar 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+