ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే వెల్లడించిన సంగతి తెలిసిందే. మార్చి 28 నుంచి ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచిన ఐపీఎల్ 2016 సీజన్‌లోనూ ఆర్‌సీబీతోనే ఆరెంజ్ ఆర్మీ తమ క్యాంపైన్‌ను ప్రారంభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగానే ఈ మ్యాచ్ జరగడం విశేషం. 10 ఏళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఆర్‌సీబీతోనే చిన్నస్వామి స్టేడియం వేదికగా తమ క్యాంపైన్‌ను ప్రారంభిస్తుండటంతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఐపీఎల్ 2016 సీజన్‌లో ఆర్‌సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఆ టోర్నీకి నాలుగోది. మొదటిది కాదు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 45 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తమ క్యాంపైన్‌ను ఓటమితో ప్రారంభించినా.. ఫైనల్లో ఆర్‌సీబీని ఓడించి టైటిల్‌ను అందుకుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఆర్‌సీబీతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తమ క్యాంపైన్‌ను ప్రారంభిస్తుండటంతో కాటేరమ్మ కొడుకులకు టైటిల్ ఖాయమని, కావ్య పాపదే ట్రోఫీ అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో మూడు మ్యాచ్‌లు ఇతర జట్ల వేదికల్లో ఆడనుండగా.. ఒకే ఒక్క మ్యాచ్ హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, బెంగళూరు)
ఏప్రిల్ 02: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7:30, కోల్‌కతా)
ఏప్రిల్ 05: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ (మధ్యాహ్నం 3:30, హైదరాబాద్) - హోమ్ మ్యాచ్
ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30, న్యూ చండీగఢ్)
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.