Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ. 18,520 కోట్లు.. ఆర్‌సీబీ కోసం స్వీడెన్ కంపెనీ భారీ ఆఫర్!

ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును కొనుగోలు చేసేందుకు స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ (EQT) గ్రూప్ తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీని కొనుగోలు చేసేందుకు రూ.18,520 కోట్లు చెల్లించేందుకు కూడా ఈ సంస్థ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కొనుగోలుకు సంబంధించి బిడ్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 16.

ప్రస్తుతం ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి.. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డయాజియో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ యజమానిగా ఉంది. నవంబర్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తన వాటాను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తమ ప్రధాన వ్యాపారంలో పెట్టుబడులు పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విక్రయంలో పురుషుల ఐపీఎల్ జట్టుతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ జట్లు రెండూ ఉన్నాయి.

Swedish Giant EQT Group Leads Race to Acquire RCB for Record-Breaking 2 1 Billion

అప్పటి నుంచి దాదాపు తొమ్మిది నుంచి పంది మంది బిడ్డర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిలో సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, మణిపాల్ గ్రూప్ ఛైర్మన్ రంజన్ పాయ్, ఈక్యూటీ, లాన్సర్ క్యాపిటల్ సంస్థల వారు ఉన్నారు. మార్చి 31 నాటికి అమ్మకపు ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యంత విలువైన ఆస్తుల్లో ఒకటిగా ఆర్‌సీబీ నిలవనుంది.

2008లో ఐపీఎల్ ఆరంభ సమయంలో యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా బెంగళూరు ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. అనంతరం అతను అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో భారత్‌లోని తన అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా బెంగళూరు ఫ్రాంచైజీని డయాజియో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి ఆర్‌సీబీ ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ముగియనుంది.

Story first published: Saturday, March 14, 2026, 13:54 [IST]
Other articles published on Mar 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+