న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ రికార్డుని సమం చేసిన కోహ్లీ

India vs West Indies 2019 : Virat Kohli Equals Rohit Sharma Record During 3rd T20 || Oneindia Telugu
Virat Kohli Equals Rohit Sharma Record During Third India vs West Indies Twenty20 Match

హైదరాబాద్: ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు. వెస్టిండిస్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోని విరాట్ కోహ్లీ గుయానా వేదికగా మూడో టీ20లో మాత్రం ఫామ్‌లోకి వచ్చాడు. 45 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 59 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

<strong>టీ20ల్లో ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్</strong>టీ20ల్లో ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్

కోహ్లీకి ఇది 21వ హాఫ్ సెంచరీ

కోహ్లీకి ఇది 21వ హాఫ్ సెంచరీ

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీకి ఇది 21వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో భారత్ తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డుని సమం చేశాడు. ఇదే వెస్టిండిస్ సిరిస్‌లో ఫ్లోరిడా వేదికగా గత ఆదివారం ముగిసిన రెండో టీ20లో ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

సుష్మాస్వరాజ్‌ మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా: కోహ్లీ

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు సెంచరీలతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. దీంతోపాటు రోహిత్ శర్మ 21 హాఫ్ సెంచరీలు(17 హాఫ్ సెంచరీలు+4 సెంచరీలు) సాధించాడు. ఇప్పటివరకు 96 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 2422 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీ అత్యధిక స్కోరు 90 నాటౌట్

కోహ్లీ అత్యధిక స్కోరు 90 నాటౌట్

అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 90 నాటౌట్. ఇక, 70 మ్యాచ్‌ల్లో 2369 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (76 మ్యాచ్‌ల్లో 2272 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

'టీ20 సిరిస్ క్లీన్ స్వీప్... ఇక మా దృష్టంతా వన్డే సిరీస్‌పైనే'

3-0తో టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న భారత్

యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండిస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. టీ20 సిరిస్ విజయానంతరం ట్రోఫీతో కూడిన ఫొటోను కోహ్లీ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "గొప్ప విజయం.. ఇక ఇప్పుడు మా దృష్టి వన్డే సిరీస్‌పైనే" అని కామెంట్ కూడా పెట్టాడు.

Story first published: Wednesday, August 7, 2019, 14:36 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X