న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీ20 సిరిస్ క్లీన్ స్వీప్... ఇక మా దృష్టంతా వన్డే సిరీస్‌పైనే'

 India vs West Indies: Virat Kohli posts picture with team after win, targets ODI series

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (52; 45బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. టీ20 సిరిస్ విజయానంతరం ట్రోఫీతో కూడిన ఫొటోను కోహ్లీ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. "గొప్ప విజయం.. ఇక ఇప్పుడు మా దృష్టి వన్డే సిరీస్‌పైనే" అని కామెంట్ కూడా పెట్టాడు.

2 వికెట్లతో మెరిసిన దీపక్‌ చాహర్‌

2 వికెట్లతో మెరిసిన దీపక్‌ చాహర్‌

యువ పేసర్ దీపక్‌ చాహర్‌ (3/4) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 146/6 కు పరిమితమైంది. అనంతరం 147 పరుగుల లక్ష్య చేధనలో.. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌ (3) మళ్లీ నిరాశ పరిచాడు. విండీస్ పేసర్ థామస్‌ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ ఆఖరి బంతికి షాట్‌ ఆడే క్రమంలో కాట్రెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (20; 18బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో అలెన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.

ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?

హాఫ్ సెంచరీతో రాణించిన పంత్

హాఫ్ సెంచరీతో రాణించిన పంత్

అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 16వ ఓవర్‌లో కోహ్లీ.. 17వ ఓవర్‌లో పంత్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే థామస్‌ బౌలింగ్లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.

థామస్‌ బౌలింగ్లోనే సిక్స్ బాదిన పంత్

థామస్‌ బౌలింగ్లోనే సిక్స్ బాదిన పంత్

కోహ్లీ నిష్క్రమణ అనంతరం థామస్‌ బౌలింగ్లోనే పంత్ సిక్స్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేసాడు. కాట్రెల్‌ వేసిన 19వ ఓవర్లో మనీష్ పాండే (2) తడబడంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఇక బ్రాత్‌వైట్‌ వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతికే పంత్ సిక్సర్‌ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమయిన పంత్.. ఈ మ్యాచులో ఆకట్టుకున్నాడు.

మరోసారి విరుద్ధ ప్రయోజనాల సెగ.. ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్‌ నోటీసులు

వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం

వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం

అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభం అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టును కీరన్‌ పొలార్డ్‌ (58; 45 బంతుల్లో 1×4, 6×6) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. చివర్లో పావెల్‌ (32 నాటౌట్‌; 20 బంతుల్లో 1×4, 2×6) మెరుపులతో విండీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. మూడు వికెట్లు తీసిన భారత బౌలర్ దీపక్‌ చాహర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లభించింది. గురువారం ఇదే మైదానంలో తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది.

Story first published: Wednesday, August 7, 2019, 12:04 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X