న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సుష్మాస్వరాజ్‌ మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా: కోహ్లీ

Indian Captain Virat Kohli pays his respect to Sushma Swaraj in a heartfelt post

హైదరాబాద్: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ (67) మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సుష్మా స్వరాజ్‌కు గుండె పోటు రావడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు తరలించారు. దాదాపు గంట పాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేసినా.. చివరకు రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మా స్వరాజ్‌ కన్నుమూశారు.

<strong>ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?</strong>ఎందరు దరఖాస్తు చేసుకున్నా స్వదేశీ కోచ్‌కే ప్రాధాన్యం.. రవిశాస్త్రి కొనసాగింపు?

తీవ్ర మనస్తాపానికి గురయ్యా:

పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సుష్మా స్వరాజ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా క్రికెటర్లు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. 'సుష్మా స్వరాజ్‌మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా, చాలా బాధపడ్డాను. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

 లోధీ రోడ్డులో అంత్యక్రియలు:

లోధీ రోడ్డులో అంత్యక్రియలు:

సుష్మా స్వరాజ్‌ మృతదేహాన్ని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం లోధీ రోడ్డులో అంత్యక్రియలు జరుగుతాయి. సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. 1970లో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా సుష్మా పనిచేశారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు.

దులీప్ ట్రోఫీలో పలు మార్పులు చేసిన బీసీసీఐ

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా:

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా:

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో చేజిక్కించుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ గురువారం నుంచి ఆరంభం కానుంది. అనంతరం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరుగనుంది.

Story first published: Wednesday, August 7, 2019, 12:56 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X