న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుదరుకుంటే దబిడి దిబిడే.. ప‌ృథ్వీ షాను వెనుకేసుకొచ్చిన కోహ్లీ

Virat Kohli backs Prithvi Shaw to come good in the second Test
IND VS NZ,2nd Test : Virat Kohli Hints At Prithvi Shaw Opening For India In 2nd Test | Oneindia

క్రైస్ట్‌చ‌ర్చ్‌ : నిలకడలేమి ఆట‌తో సతమతమవుతున్న టీమిండియా ఓపెనర్ పృథ్వీషాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. అతనికి కొంత సమయం ఇవ్వాలని విమర్శకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ ముంబై సెన్సేషన్ టచ్‌లోకి వస్తే ఆట స్వరూపమే మారుతుందని తెలిపాడు.

అనాలసిస్ అవసరం లేదు..

అనాలసిస్ అవసరం లేదు..

ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. పృథ్వీషా లోపాలపై ఇప్పుడే అనాలసిస్ అవసరం లేదన్నాడు. 'పృథ్వీషా బ్యాటింగ్‌ లోపాలపై ఇప్పుడే విశ్లేషణ అవసరం లేదు. తొలిసారి అతడు విదేశాల్లో ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌లో తప్పులేమీ కనిపించడం లేదు. ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేయలేదంతే. ఏడేనిమిది సార్లు అదే పొరపాటు చేస్తే అప్పుడు చూసుకోవచ్చు. షా సహజంగా స్ట్రోక్‌ప్లేయర్‌. పరుగులు చేసేందుకు దారి కనుక్కొంటాడు. భారీ స్కోర్లు చేయడం అతడికి తెలుసు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్‌మెంట్!!

అది అర్థం చేసుకుంటే చాలు..

అది అర్థం చేసుకుంటే చాలు..

ఇక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్‌ను అర్థం చేసుకుంటే షా చెలరేగుతాడని తెలిపాడు. ‘ఇక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్ ను అర్థం చేసుకోవడంలోనే విషయం దాగి ఉంది. ఒక్కసారి అతను(షా)అర్థం చేసుకున్నాడంటే అతను మరింత విధ్వంసకరంగా ఆడతాడు. టచ్‌లోకి వచ్చాడంటే ఆట స్వరూపమే మారిపోతుంది. అందరు బ్యాట్స్‌మెన్ లాగానే పృథ్వీ కూడా బాగా ఆడాలనే బరిలో దిగుతాడు. అయితే కుదురుకునేందుకు అతనికి కొంత సమయం ఇవ్వాలి. పరిస్థితులకు అలవాటుపడితే స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తాడు. 'అని కోహ్లీ మద్దతుగా నిలిచాడు.

చేజేతులారా..

చేజేతులారా..

తొలుత గాయం.. ఆ తర్వాత డోపింగ్.. ఇలా అనేక సమస్యలతో సతమతమైన పృథ్వీ షా ఏడాది పాటు జట్టుకు దూరమయ్యాడు. ఇలా దెబ్బతిన్న ప్రతీసారి దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన ఈ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్.. సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గాయాలతో జట్టులో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఈ యువ ఓపెనర్ దారుణంగా విఫలమయ్యాడు.

మహిళల టీ20 ప్రపంచకప్‌ : న్యూజిలాండ్‌తో భారత్ ఢీ.. గెలిస్తే సెమీస్‌కు

కోహ్లీ మాటలు చూస్తే..

కోహ్లీ మాటలు చూస్తే..

మయాంక్ అగర్వాల్‌తో కలిసి బరిలోకి దిగిన అతను తనదైన మార్క్ పెర్ఫామెన్స్ చేయలేకపోయాడు. మూడు వన్డేల సిరీస్, తొలి టెస్టులో దారుణంగా విఫలమై విమర్శకుల నోట నానుతున్నాడు. ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ను తీసుకోకుండా, పృథ్వీని ఎందుకు తీసుకున్నారంటూ అటు మాజీ క్రికెటర్లు.. ఇటు అభిమానులు టీమ్‌మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అతన్ని వెనుకేసుకు రావడం చూస్తే రెండో టెస్ట్‌లో కూడా అతనికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, February 26, 2020, 19:28 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X