Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సీజన్‌తో ధోనీ కెరీర్ ఖతమ్:ఇర్ఫాన్ పఠాన్

ఐపీఎల్ 2026 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చివరిది కావచ్చని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లేకుండా సీఎస్‌కే అసంపూర్ణమని, అతను లేకుండా ఐపీఎల్‌ను ఊహించుకోవడం చాలా కష్టమని అన్నాడు. ఈ సీజన్ టైటిల్ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని సీఎస్‌కే భావిస్తుందని చెప్పాడు.

44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 6 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి ప్రతీ సీజన్ ముందు ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ధోనీ కూడా తన రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇవ్వకుండా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.

Irfan Pathan Predicts IPL 2026 Could Be MS Dhoni s Farewell Season with CSK

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. ధోనీ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ధోనీ లేకుండా సీఎస్‌కే అసంపూర్ణం. పసుపు రంగు జెర్సీలో అతన్ని చూడటం బహుశా ఇదే చివరిసారి కావచ్చు. ధోనీ లేకుండా CSK, ఐపీఎల్‌ను ఊహించుకోవడం చాలా కష్టం.

ఈ సీజన్‌లో అందరినీ ఏకం చేయడంలో ధోనీ కీలక పాత్ర పోషిస్తాడు. ధోనీ ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడో నాకు తెలియదు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి జట్టుకు ఎంతో సహాయపడుతుంది. రుతురాజ్ గైక్వాడ్ టీమ్ కెప్టెన్. అయితే భవిష్యత్తు కోసం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లను సిద్దం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ పాత్ర కీలకం అవుతుంది. అతను ఖచ్చితంగా మార్పు చూపిస్తారని నేను ఆశిస్తున్నా.

ధోనీ ఫిట్‌నెస్, బ్యాటింగ్ స్థానం, ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు? అనే ప్రశ్నలు ఇంకా వస్తూనే ఉంటాయి. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. ఆరో ఐపీఎల్ ట్రోఫీని గెలిచి ధోనీకి ఘన వీడ్కోలు పలకాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావిస్తోంది.'అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు ధోనీ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడని సీఎస్‌కే ఈఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. వికెట్ కీపర్‌గా ఆడుతాడా? ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా? అనేది కోచింగ్ స్టాఫ్ నిర్ణయిస్తుందని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు.

Story first published: Saturday, March 14, 2026, 11:39 [IST]
Other articles published on Mar 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+