For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అబ్బో క్రీడా స్ఫూర్తి.. ఇదేం చారిటి మ్యాచ్ కాదు: లిటన్ దాస్

పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డే చారిటీ మ్యాచ్ కాదని, అంతర్జాతీయ మ్యాచ్ అని చురకలంటించాడు. ఐసీసీ రూల్స్‌ ప్రకారమే సల్మాన్ అఘాను రనౌట్ చేశామని స్పష్టం చేశాడు.

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో సల్మాన్ అలీ అఘా రనౌట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ రనౌట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్రీడాస్ఫూర్తికి విరుద్దమని కొందరంటే.. రూల్స్ ప్రకారం ఔటేనని మరికొందరు వాదిస్తున్నారు.

 ఫన్నీ రనౌట్.. సల్మాన్ అఘాపై ఐసీసీ చర్యలు ఫన్నీ రనౌట్.. సల్మాన్ అఘాపై ఐసీసీ చర్యలు

అసలేం జరిగిందంటే..

బంగ్లా కెప్టెన్ మెహ్‌దీ హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్‌లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్‌ వైపు డిఫెన్స్ షాట్ ఆడాడు. బంతి కాస్త నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్‌‌కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ మెహ్‌దీ హసన్ మిరాజ్ వేగంగా బంతిని అందుకొని నాన్‌స్ట్రైకర్ వికెట్లను కొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. సల్మాన్ అఘా క్రీజు బయటే ఉన్నాడని, బంతి ఇంకా డెడ్ అవ్వలేదని థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

ఈ అనూహ్య ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన సల్మాన్ అఘా బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పాటు లిటన్ దాస్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా మైదానం వీడే క్రమంలో బ్యాట్, గ్లౌజులను నేలకు కొట్టాడు.

Not a Charity League Litton Das Defends Controversial Salman Agha Run-Out in 2nd ODI

తాను రనౌట్ చేసేవాడిని కాదు..

అయితే ఈ రనౌట్‌ను సల్మాన్ అఘాతో పాటు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని అభిప్రాయపడ్డారు. సల్మాన్ అఘా అయితే తాను మిరాజ్ స్థానంలో ఉంటే రనౌట్ చేసేవాడిని కాదని తెలిపాడు. తన రనౌట్‌ నిబంధనల ప్రకారం సరైనదే అయినా.. క్రీడాస్ఫూర్తికి విరుద్దమని అభిప్రాయపడ్డాడు.

తానైతే క్రీడాస్ఫూర్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడినని, పాకిస్థాన్ ఎప్పుడూ ఇలా చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోదని స్పష్టం చేశాడు. బంతి తన ప్యాడ్‌తో పాటు బ్యాట్‌కు తగలడంతోనే బౌలర్‌కు అందించాలనుకున్నాని, తనకు పరుగు తీసే ఉద్దేశం కూడా లేదని సల్మాన్ అఘా పేర్కొన్నాడు. రూల్స్ ప్రకారం బంగ్లాదేశ్ చేసింది సరైందే అయినా.. క్రీడాస్ఫూర్తికి విరుద్దమని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు.

క్రీడా స్ఫూర్తి చచ్చిపోయింది.. పాక్ ఎప్పుడూ ఇలా తొండాట ఆడదు: సల్మాన్ అఘాక్రీడా స్ఫూర్తి చచ్చిపోయింది.. పాక్ ఎప్పుడూ ఇలా తొండాట ఆడదు: సల్మాన్ అఘా

అబ్బో క్రీడా స్ఫూర్తి..

ఈ వ్యాఖ్యలకు లిటన్ దాస్ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. 'ముందుగా అందరికీ ఒక విషయం స్పష్టం చేయాలనుకున్నా. ఇదేమీ చారిటీ మ్యాచ్ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్. నిబంధనలకు అనుగుణంగానే మేం రనౌట్ చేశాం. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతీ ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే మైదానంలో ఆటగాళ్లుగా అది ఔట్ అంటే ఔటేనని మా అందరికి తెలుసు. క్రీడా స్ఫూర్తి గురించి పాక్ ఆటగాళ్లు మాట్లాడటం విచిత్రంగా ఉంది.'అని లిటన్ దాస్ బదులిచ్చాడు.

Story first published: Saturday, March 14, 2026, 19:28 [IST]
Other articles published on Mar 14, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+