Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీ చరణికి అరుదైన గౌరవం.. బీసీసీఐ నమాన్ అవార్డ్స్ లిస్ట్ ఇదే!

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమాన్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి రంగం సిద్దమైంది. ఆదివారం ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 2024-25 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో పాటు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసిన మాజీ క్రికెటర్లకు బీసీసీఐ అవార్డులు ప్రదానం చేయనుంది.

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీలను కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. మహిళల క్రికెట్ నుంచి దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఈ అవార్డ్ దక్కింది. బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్మృతిమంధానకు దక్కింది. తెలుగు తేజం, కడప బిడ్డ శ్రీచరణికి బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ అవార్డ్ లభించింది.

Shree Charani to Receive Best International Debut at BCCI Naman Awards 2024-25 Full Winners List

గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన శ్రీచరణి.. భారత వన్డే ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించింది. పురుషుల క్రికెట్ నుంచి హర్షిత్ రాణాకు ఈ అవార్డ్ లభించింది.

బీసీసీఐ నమాన్ అవార్డ్స్ లిస్ట్ ఇదే

కల్నల్ సి.కె. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ

మహిళల బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: మిథాలీ రాజ్

అంతర్జాతీయ క్రికెట్ అవార్డులు

పాలీ ఉమ్రిగర్ అవార్డు (ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్): శుభ్‌మన్ గిల్

ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్: స్మృతి మంధాన

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు (మహిళలు): స్మృతి మంధాన

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక వికెట్లు (మహిళలు): దీప్తి శర్మ

ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు): హర్షిత్ రాణా

ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు): శ్రీ చరణి


డొమెస్టిక్ క్రికెట్ అవార్డులు

మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ - అత్యధిక పరుగులు):

ఎలైట్ గ్రూప్: వై.వి. రాథోడ్ (విదర్భ)

ప్లేట్ గ్రూప్: స్నేహల్ కౌతంకర్ (గోవా)

మాధవరావు సింధియా అవార్డు (రంజీ ట్రోఫీ - అత్యధిక వికెట్లు):

ఎలైట్ గ్రూప్: హర్ష్ దూబే (విదర్భ)

ప్లేట్ గ్రూప్: సుచిత్ జె (నాగాలాండ్)

లాలా అమర్‌నాథ్ అవార్డు (రంజీ ట్రోఫీ ఉత్తమ ఆల్ రౌండర్): హర్ష్ దూబే (విదర్భ)

లాలా అమర్‌నాథ్ అవార్డు (పరిమిత ఓవర్ల ఉత్తమ ఆల్ రౌండర్): ఆయుష్ మ్హత్రే (ముంబై)

జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (ఉత్తమ మహిళా క్రికెటర్ - సీనియర్ డొమెస్టిక్): షఫాలీ వర్మ (హర్యానా)

జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (ఉత్తమ మహిళా క్రికెటర్ - జూనియర్ డొమెస్టిక్): ఇరా జాదవ్ (ముంబై)

వయస్సు విభాగాల అవార్డులు (జూనియర్ క్రికెట్)

ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-23 సి.కె. నాయుడు ట్రోఫీ):

అత్యధిక పరుగులు (ఎలైట్): మెక్నీల్ హెచ్ ఎన్ (కర్ణాటక)

అత్యధిక వికెట్లు (ఎలైట్): విక్కీ ఓస్త్వాల్ (మహారాష్ట్ర)

ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ (అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీ):

అత్యధిక పరుగులు (ఎలైట్): నిత్య జె పాండ్యా (బరోడా)

అత్యధిక వికెట్లు (ఎలైట్): హేమచూడేశన్ జె (తమిళనాడు)

జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ):

అత్యధిక పరుగులు (ఎలైట్): శాంతను సింగ్ (ఉత్తరప్రదేశ్)

అత్యధిక వికెట్లు (ఎలైట్): యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)

ఇతర అవార్డులు

దేశవాళీ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అసోసియేషన్: ముంబై క్రికెట్ అసోసియేషన్

ఉత్తమ అంపైర్ (డొమెస్టిక్ క్రికెట్): ఉల్హాస్ గాంధే (విదర్భ)

Story first published: Saturday, March 14, 2026, 15:50 [IST]
Other articles published on Mar 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+