న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కే

‘I feel bad for him’ – MSK Prasad on Ambati Rayudu’s exclusion from World Cup 2019 squad

హైదరాబాద్ : వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడిని తప్పించడం తనను చాలా బాధించిందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. అయితే ఫిట్‌నెస్ అంచనాల్ని అందుకోలేకపోవడంతోనే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చిందని ఈ మాజీ సెలెక్టర్ చెప్పుకొచ్చాడు. సుదీర్ఘకాలం భారత చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడి అంశాన్ని ప్రస్తావించగా ఎమ్మెస్కే స్పందించాడు.

పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడుపానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

'రాయుడి గురించి నేను చాలా ప్రయత్నించాను. 2016లో జింబాబ్వే టూర్ తర్వాత టీమిండియా సెలక్షన్ కమిటీ.. రాయుడికి టెస్టుల్లో అవకాశాలివ్వాలని భావించింది. నేను కూడా వ్యక్తిగతంగా టెస్టు క్రికెట్‌పై ఎందుకు దృష్టి పెట్టడం లేదని రాయుడిని ప్రశ్నించా. లాంగెస్ట్ ఫార్మాట్‌లో ఆడాలని సూచించా. కేవలం అతని ఐపీఎల్ పెర్ఫామెన్స్ ద్వారానే వన్డే జట్టుకు ఎంపిక చేసామన్న విషయం మీకు గుర్తుందో లేదో తెలియదు. చాలా మందికి అతి నచ్చలేదు కూడా.

ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఓ నెల పాటు అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించాం. కానీ.. అతను ఫిట్‌నెస్ విషయంలో అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఇక వరల్డ్‌కప్‌కు రాయుడిని పక్కన పెట్టడం వ్యక్తిగతంగా నన్ను బాధించింది' ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

2018-19లో టీమిండియాలో అవకాశాలు దక్కించుకున్న అంబటి రాయుడు.. నాలుగో స్థానంలో 47.05 సగటుతో నిలకడగా రాణించాడు. దీంతో.. 2019 వన్డే ప్రపంచకప్‌లో అతను ఆడటం లాంఛనమేనని అంతా ఊహించారు. కానీ.. అనూహ్యంగా త్రీ డైమన్షన్స్ అంటూ వరల్డ్‌కప్ టీమ్‌లో విజయ్ శంకర్‌ని ఎంపిక చేసిన సెలక్టర్లు.. రాయుడికి మొండిచేయి చూపారు.

ఈ వ్యవహారంపై రాయుడు అప్పట్లో త్రీడీ కళ్లద్దాలంటూ ట్వీట్ కూడా చేశాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్, శంకర్ గాయపడ్డా.. స్టాండ్ బై జాబితాలో ఉన్నతనని కాదని రిషభ్ పంత్, మయాంక్‌ను వరల్డ్ కప్ ఆడించడంతో తీవ్రంగా హర్ట్ అయిన రాయుడు.. ఆ టోర్నీ జరుగుతుండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఇక సెలక్టర్ల కోసం బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అజిత్ అగార్కర్, నయాన్ మోంగియా, శివరామకృష్ణన్ తదితరులు రేసులో ఉన్నారు. మరో వారంలో చీఫ్ సెలక్టర్ ఎవరనేదానిపై స్పష్టత రానుంది.

Story first published: Wednesday, February 5, 2020, 16:36 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X