న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘నామ్ ఏక్.. కామ్ అనేక్’.. రాహులా నువ్వు సూపరో సూపర్!

India vs New Zealand 3rd ODI : KL Rahul's 4th ODI Hundred, Twitterati Applauds!
Twitter Reactions: KL Rahul smacks his 4th ODI century at Bay Oval after India collapse

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్( 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 112) సెంచరీతో కదం తొక్కాడు. 62 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆకట్టుకునే ఆటతీరుతో ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌(62)తో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగులు, మనీష్ పాండే(42) 107 రన్స్ జోడించి భారత్‌కు 296 పరుగుల భారీ స్కోర్ అందించాడు. ఫలితంగా ప్రత్యర్థి ముందు భారత్ 297 లక్ష్యాన్ని ఉంచింది.

89 vs 63 : నేను సాధించాను... మీరు కూడా సాధించగలరు అంటున్న సానియా!89 vs 63 : నేను సాధించాను... మీరు కూడా సాధించగలరు అంటున్న సానియా!

రైనా తర్వాత రాహులే..

రైనా తర్వాత రాహులే..

ఇక తొలి వన్డే 88 పరుగులతో అజేయంగా నిలిచిన రాహుల్ గత వన్డేలో మాత్రం విఫలమయ్యాడు. 4 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇక తాజా వన్డేలో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ తన ఫామ్‌ను రిపీట్ చేస్తూ అద్భుత సెంచరీ సాధించాడు. తొలుత 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న రాహుల్.. అనంతరం ధాటిగా ఆడి మరో 38 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో రాహుల్‌కు నాలుగో సెంచరీ కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి శతకం సాధించడం మాత్రం తొలిసారి. ఫలితంగా ఐదో స్థానంలో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రాహుల్ రికార్డుకెక్కాడు. అతని కన్నా ముందు 2015లో జింబాంబ్వేపైనా సురేశ్ రైనా ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టే సత్తా ఆ ముగ్గురికే ఉంది : యువరాజ్

రెండు సార్లు చేజారినా.. ఈ సారి మాత్రం

ఇక రాహుల్ గతంలో ఐదో స్థానంలో వచ్చి సెంచరీ చేసే అవకాశాన్ని రెండు సార్లు చేజార్చుకున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఐదో స్థానంలో దిగిన రాహుల్ 80 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ సిరీస్ తొలి వన్డేలో88 పరుగులతో అజేయంగా నిలిచాడు కానీ ఈ సారి మాత్రం ఆ అవకాశాన్ని చేజార్చుకోలేదు. ఇక 1999 తర్వాత ఆసియా బయట సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 1999లో రాహుల్ ద్రవిడ్ టాంటన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా రాహు‌ల్ ద్రవిడ్ 145 పరుగులు చేశాడు.

నెటిజన్ల ప్రశంసల జల్లు..

నిలకడైన ఆటతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓపెనర్‌గా, మూడు, నాలుగు, ఐదు ఇలా ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా తనదైన ఆటతో ఇరగదీస్తున్న రాహుల్ అద్భుత ఆటగాడని కొనియాడుతున్నారు. మరో వైపు కీపర్‌గా కూడా అదనపు బాద్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న రాహుల్ విలువైన ఆటగాడని ప్రశంసిస్తున్నారు. రాహులా నువ్వు సూపరో సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఒక్కడే కానీ.. అన్నీ..

రాహుల్ పేరు ఒక్కటే కానీ టీమిండియాకు అన్నీ తానేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొనియాడాడు. ‌‘ఓపెనింగ్ చేస్తావా?.. నాలుగులో ఆడే సత్తా ఉందా?.. కీపింగ్ చేయగలవా? ఫీనిషర్‌గా చెలరేగగలవా? జట్టును ముందుండి నడిపించగలవా? పేరు ఒక్కటే.. కానీ అన్నీ చేయాలి. ఇవన్నీ అద్భుతమైన ఆటగాడు రాహుల్ వల్లే సాధ్యం'అని అకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

Story first published: Tuesday, February 11, 2020, 13:49 [IST]
Other articles published on Feb 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X