న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో డబుల్ సెంచరీ కొట్టే సత్తా ఆ ముగ్గురికే ఉంది : యువరాజ్

Yuvraj Singh Picks 3 Batsmen Who Can Score 200 In T20 Cricket || Oneindia Telugu
 Yuvraj Singh names three players who can score double century in T20Is

న్యూఢిల్లీ: అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేస్తూ టీ20 క్రికెట్‌లో రికార్డుల రారాజుగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెట్ యువరాజ్ సింగ్ పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ కూడా నమోదవుతుందని జోస్యం చెప్పాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. 'టీ20ల్లో డబుల్‌ సెంచరీ చేయడం చాలా కష్టమని నేను భావిస్తాను. నన్నడిగితే అది అంత సులవుకాదని చెబుతాను. కానీ కాలంతో పాటు మారుతున్న ప్రస్తుత క్రికెట్‌ను చూస్తే సాధ్యం కానిది ఏదీ లేదనిపిస్తుంది. టీ20ల్లో డబుల్‌ సెంచరీ కొట్టి అవకాశం నా దృష్టిలో ముగ్గురికి ఉందని నమ్ముతున్నా. క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌, రోహిత్‌ శర్మలకు టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించే సత్తా ఉంది' అని యువీ చెప్పుకొచ్చాడు.

రోహిత్ బాయ్ కుళ్లుకోకు.. నీ ఫోటో కూడా పెడ్తాలే : చాహల్రోహిత్ బాయ్ కుళ్లుకోకు.. నీ ఫోటో కూడా పెడ్తాలే : చాహల్

ఇంటర్నేషనల్ టీ20ల్లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకూ నాలుగు శతకాలు సాధించగా, మరే క్రికెటరూ ఈ ఘనతనందుకోలేదు. ఆసీస్‌కు చెందిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, న్యూజిలాండ్‌ హార్డ్‌ హిట్టర్‌ కొలిన్‌ మున్రోలు తలో మూడు సెంచరీలతో రోహిత్‌ తర్వాత స్థానంలో నిలిచారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆసీస్‌ ఆటగాడు అరోన్‌ ఫించ్‌ పేరిట ఉంది. 2018లో జింబాబ్వేపై ఫించ్‌ 172 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. అఫ్గానిస్థాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్‌ 162 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌ టీ20ల్లో అత్యధిక స్కోరు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. 2013లో ఆర్సీబీ తరఫున గేల్‌ అజేయంగా 175 పరుగులు సాధించాడు.

బంగ్లా ఆటగాళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య.. అప్పుడు నాగినీ.. ఇప్పుడు బాహాబాహీబంగ్లా ఆటగాళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య.. అప్పుడు నాగినీ.. ఇప్పుడు బాహాబాహీ

ఇక ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్‌ పలు రికార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన రికార్డుతో పాటు 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి తక్కువ బంతుల్లో ఆ ఫీట్‌ నమోదు చేసిన ఆటగాడిగా యువీ ఘనత సాధించాడు.

Story first published: Monday, February 10, 2020, 21:33 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X