న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్ రచించిన ఆ వ్యూహానికి ఫిదా అయ్యా: సురేశ్ రైనా

Suresh Raina recalls Rahul Dravids plan to dismiss Kamran Akmal

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అనగానే అందరూ సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడుతుంటారని కానీ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా చాలా కీలకమని ఇటీవల మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ద్రవిడ్ సిద్దహస్తుడే..

ద్రవిడ్ సిద్దహస్తుడే..

మైదానంలో వ్యూహాలు రచించడంలో ద్రవిడ్ కూడా సిద్ద హస్తుడేనన్నాడు. 2006లో ముల్తాన్ వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన వన్డేలో ఆ జట్టు ఓపెనర్ కమ్రాన్ అక్మల్‌ను అద్భుతమైన వ్యూహంతో ద్రవిడ్ బోల్తాకొట్టించాడని తెలిపాడు. ద్రవిడ్ రచించిన ఆ వ్యూహానికి తాను ఫిదా అయినట్లు తాజాగా ఏబీపీ న్యూస్‌ వేదికగా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో నిర్వహించిన లైవ్ సెషన్‌లో చెప్పుకొచ్చాడు.

ద్రవిడ్ చెప్పినట్టే..

ద్రవిడ్ చెప్పినట్టే..

‘2006 పాక్ పర్యటనలో పాయింట్ దిశలో ఉండి నేను పట్టుకున్న క్యాచ్ నాకింకా గుర్తుంది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ మా కెప్టెన్. ఇర్ఫాన్ పఠాన్ బౌలర్. కమ్రాన్ అక్మల్ బ్యాటింగ్. ఫస్ట్ పవర్ ప్లే కారణంగా నిబంధనల ప్రకారం సర్కిల్ లోపలే ఫీల్డింగ్ చేయాలి. దీంతో రాహుల్ బాయ్ నా దగ్గరకు వచ్చి పాయింట్ దిశలో ఫీల్డింగ్ చేస్తావా? అని అడిగాడు. నేను సరే అంటూ.. ఎక్కడ నిలబడాలో చెప్పమన్నా. సర్కిల్‌లోపలే ఉంటూ క్యాచ్ అందుకోవాలని సూచించాడు. ఇక ఇర్ఫాన్ బంతి వేయగానే.. అక్మల్ బంతిని బలంగా బాదాడు. అది నేరుగా వచ్చి నా చేతిలోనే పడింది. ద్రవిడ్ చెప్పినట్టుగానే క్యాచ్ రావడం నన్ను ఆకట్టుకుంది. ఆ క్యాచ్‌లో కెప్టెన్, బౌలర్, ఫీల్డర్ బాగస్వామ్యం ఉండటంతో అది నాకు చాలా ప్రత్యేకమైంది.'అని రైనా గుర్తు చేసుకున్నాడు.

భారత్ ఘన విజయం..

భారత్ ఘన విజయం..

ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 41.5 ఓవర్లలో 161 పరుగులకి ఆలౌటవగా.. ఇంజిమామ్‌ ఉల్ హక్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఆర్పీ సింగ్ 4 వికెట్లు, ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ 32.3 ఓవర్లలోనే 162/5తో ఛేదించింది. రాహుల్ ద్రవిడ్ (59), యువరాజ్ సింగ్ (37), సురేశ్ రైనా (35 నాటౌట్) నిలకడగా రాణించారు. మొత్తంగా ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తో కైవసం చేసుకుంది.

ద్రవిడ్ ప్రభావమే ఎక్కువ..

ద్రవిడ్ ప్రభావమే ఎక్కువ..

సచిన్ నీడలో ఆడటం కారణంగా ద్రవిడ్‌కు దక్కాల్సిన గౌరవం, పేరు దక్కలేదని ఇటీవల గంభీర్ తెలిపాడు. అంతేకాకుండా భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ కన్నా ద్రవిడ్‌దే ఎక్కువ ప్రభావమని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో చెప్పుకొచ్చాడు. ‘సౌరవ్ గంగూలీ సారథ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన నేను.. రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో టెస్ట్ కెరీర్‌ను మొదలుపెట్టా. కానీ దురదృష్టవశాత్తు అతని కెప్టెన్సీకి ఏ ఒక్కరూ క్రెడిట్ ఇవ్వడం లేదు. కేవలం గంగూలీ, ధోనీ, విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుతున్నాం.

కానీ ద్రవిడ్ కూడా గొప్ప సారథనే విషయాన్ని గ్రహించాలి. జట్టు అవసరాలకు తగ్గట్టు ద్రవిడ్ ఆడే వాడు. నా దృష్టిలో భారత క్రికెట్‌పై ద్రవిడ్ ప్రభావమే ఎక్కువ. సచిన్ టెండూల్కర్ నీడలోనే ఆడటంతో అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.'అని గంభీర్ తెలిపాడు.

క్రికెట్‌లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేయలేదా?

Story first published: Sunday, June 28, 2020, 13:19 [IST]
Other articles published on Jun 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X