Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేయలేదా?

Sachin Tendulkars Son Arjun Tendulkar Fired On Twitter For nepotism

ముంబై: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణంతో నెపోటిజమ్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. బంధుప్రీతి కారణంగా నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందనే వాదన సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తోంది. అయితే ఇది కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదని అన్ని సినీ పరిశ్రమల్లో ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇక నెపోటిజమ్ అనేది కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదని క్రికెట్‌లో కూడా ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు.

అండర్-16లోకి అర్జున్ ఎలా వచ్చాడు.?

అండర్-16లోకి అర్జున్ ఎలా వచ్చాడు.?

ముఖ్యంగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ పేరును ఉదహారిస్తూ క్రికెట్‌లో బంధుప్రీతి ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అర్జున్‌కు నెపోటిజానికి సంబంధం ఏంటనే సందేహం కలగవచ్చు. కానీ 2016 అండర్-16 వెస్ట్ జోన్‌ సెలెక్షన్‌లో సచిన్ కొడుకనే ఒకే ఒక కారణంతో నైపుణ్యం కలిగిన ప్రణవ్ ధనవాడేను పక్కనపెట్టేసారని ఆరోపిస్తూ తాజాగా అభిమానులు మండిపడుతున్నారు.

ఆటోడ్రైవర్ కొడుకును పక్కన పెట్టలేదా?

ఇదే విషయాన్ని తెలియజేస్తూ అప్పట్లో ఓ వార్తపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తున్నారు. ‘దిస్ ఈజ్ ఇండియా 'శీర్షిక పేరిట ప్రచురించిన ఆ స్టోరీలో.. సచిన్ కొడుకు కోసం 327 బంతుల్లో 1009 పరుగులు చేసిన ఆటో డ్రైవర్ కుమారుడు ప్రణవ్ ధనవాడేను పక్కన పెట్టెసారని ఉంది. ఈ కథనానికి సబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన ఓ అభిమాని..‘బాలీవుడ్‌లోనే నెపోటిజమ్ ఉందా? క్రికెట్‌లోనూ ఉంది. ప్రణవ్ ధనవాడే ఎక్కడా?'అని ప్రశ్నిస్తూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ వార్త కథనం కారణంగా గత వారం రోజులుగా అర్జున్ టెండూల్కర్‌పై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది.

ఇదంతా ఫేక్..

ఇదంతా ఫేక్..

అయితే అర్జున్ టెండూల్కర్‌పై వస్తున్న ఈ ఆరోపణలన్నీ అసత్యమని తేలింది. ఆ వార్త కథనం అందరిని మిస్‌లీడ్ చేసిందని స్పష్టమైంది. ఆ సమయంలో వెస్ట్ జోన్ టీమ్‌కు ఎంపికయ్యే అర్హతలు ప్రణవ్ ధనవాడే‌కు లేవని, అందుకే అతన్ని పక్కనపెట్టారని తెలిసింది. నిబంధనల ప్రకారం ముంబై జట్టుకు ఆడిన వ్యక్తినే వెస్ట్ జోన్‌కు ఎంపిక చేస్తారు. కానీ ప్రణవ్.. వెస్ట్ జోన్ టీమ్ ఎంపిక చేసిన తర్వాత ముంబై అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాతే వరల్డ్ రికార్డు పరుగులు 1009 చేశాడు. కానీ అప్పటికే వెస్ట్ జోన్ టీమ్ కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడింది.

మాకేం అన్యాయం జరగలేదు..

మాకేం అన్యాయం జరగలేదు..

ఇక ప్రణవ్ తండ్రి ప్రశాంత్ కూడా తన కొడుకు ఎలాంటి అన్యాయం జరగలేదని అప్పట్లోనే స్పష్టం చేశాడు. అర్జున్, ప్రణవ్ మంచి స్నేహితులని కూడా చెప్పుకొచ్చాడు. ఇక సెన్సేషన్ ఇన్నింగ్స్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ప్రణవ్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. చివరసారిగా 2018లో ఇంటర్ కాలేజ్ గేమ్‌లో 236 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఫామ్ అందుకునే పనిలోపడ్డాడు.

వెస్టిండీస్ బౌలర్ల ఆధిపత్యం ఓర్వలేకనే బౌన్సర్ రూల్ తెచ్చారు: డారెన్ సామీ

Story first published: Saturday, June 27, 2020, 13:19 [IST]
Other articles published on Jun 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+