న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రత్యర్థి ప్రోత్సాహంతో సెంచరీ చేశా.. అందుకే నా కొడుక్కి అతని పేరు పెట్టా: గావస్కర్

Sunil Gavaskar Says West Indies Cricketer Who Shockingly Guided Him To Score Test Tons

న్యూఢిల్లీ: స్లెడ్జింగ్.. ప్రత్యర్థిని మాటలతో రెచ్చగొట్టి ఔట్ చేసేందుకు క్రికెట్‌లో సాధారణంగా వాడే ఫార్ములా. అయితే స్లెడ్జింగ్ బదులుగా ప్రత్యర్థి జట్టు నుంచే ఓ బ్యాట్స్‌మన్‌కు ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుందని ఊహించగలమా?.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ జీవితంలో అలాంటి అరుదైన ఘటన చోటుచేసుకుంది.

అరంగేట్ర సిరీస్‌లోనే..

అరంగేట్ర సిరీస్‌లోనే..

ప్రత్యర్థి జట్టు ప్లేయర్ ఇచ్చిన ప్రోత్సాహంతో సెంచరీ కొట్టాడట. తన అరంగేట్ర సిరీస్‌లోనే ఈ ఘటన జరిగిందని తాజాగా ఈ లిటిల్ మాస్టర్ గుర్తు చేసుకున్నాడు. 1971 వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో సునీల్ గావస్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సిరీస్‌లో మూడు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ చేసి ప్రపంచానికి తన సత్తా చూపెట్టాడు. అయితే ఆ సిరీస్‌లో తాను చేసిన ఓ సెంచరీ వెనుక విండీస్ ఆటగాడు రోహన్ కనై ప్రోత్సాహం ఉందని సన్నీ తెలిపాడు. ఆ సిరీస్ తర్వాత కనైతో ఏర్పడిన అనుబంధం వల్లనే తన కొడుక్కి రోహన్ అని పేరు పెట్టినట్లు గావస్కర్ చెప్పుకొచ్చాడు.

ఏయ్ సెంచరీ వద్దా..?

ఏయ్ సెంచరీ వద్దా..?

‘నేను అరంగేట్రం చేసిన సిరీస్‌లో విండీస్ ప్లేయర్ రోహన్ కనై నాకు పరిచయం అయ్యాడు. నేను చెత్త షాట్ ఆడిన ప్రతిసారి రోహన్ నన్ను హెచ్చరించేవాడు. ఏంటి నీకు సెంచరీ వద్దా?, దృష్టిసారించు.. ఏం ఆట ఆడుతున్నావ్ నువ్వు అనేవాడు. ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ ఎండ్ మారే క్రమంలో నా చెవిలో ఆ మాటలు చెప్పేవాడు. ప్రత్యర్థి టీమ్‌లో ఓ ఆటగాడు సెంచరీ చేయాలని అనుకోవడం నాకు తెలిసి చాలా గొప్ప విషయం.'అని గావస్కర్ తెలిపాడు.

 ఆ గౌరవంతోనే నా కొడుక్కి అతని పేరు..

ఆ గౌరవంతోనే నా కొడుక్కి అతని పేరు..

రోహన్ కనైపై ఉన్న గౌరవంతో తనకు తెలియకుండా తన కొడుక్కి అతని పేరు పెట్టానని సన్నీ గుర్తు చేసుకున్నాడు. ‘అలా రోహన్ రహస్యంగా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఆఫ్ ద ఫీల్డ్ నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో అతను కూడా ఒకడు. అతనిపై ఉన్న గౌరవం వల్లనే తెలియకుండానే నా కొడుకుకి రోహన్ అనే పేరు పెట్టా'అని గావస్కర్ చెప్పాడు. 1957-74 మధ్య విండీస్‌కు ఆడిన రోహన్ కనై 79 టెస్ట్‌ల్లో 6226 రన్స్ చేశాడు. ఇందులో 15 సెంచరీలు కూడా ఉన్నాయి.

నార్త్ ఇండియన్స్ చేతిలో సౌత్ ఆటగాళ్లు వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్

Story first published: Monday, June 8, 2020, 22:26 [IST]
Other articles published on Jun 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X