నార్త్ ఇండియన్స్ చేతిలో సౌత్ ఆటగాళ్లు వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండటంతో పాటు 'బ్లాక్ లైవ్స్ మాటర్స్'పేరుతో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది ప్రజలు తాము ఎదుర్కొన్న జాతి వివక్షను తెలియజేస్తున్నారు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ, విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా క్రికెట్‌లో వర్ణ వివక్షను ఉందని, తాము ఎదుర్కొన్నామని తెలిపారు.

కర్రోడా అంటూ..
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2013 సీజన్‌లో తాను వర్ణ వివక్షకు గురయ్యానని డారెన్ సామీ ఆరోపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో శ్రీలంక క్రికెటర్ తిసారా పెరిరా, తనను భారత అభిమానులు తమ శరీర రంగును ప్రస్తావిస్తూ అవహేళన చేశారని గుర్తు చేసుకున్నాడు. 2013, 2014 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన తనతో పాటు తిసారాను సన్‌రైజర్స్ నిర్వహించిన క్యాంప్‌లో 'కలు' అని పిలిచేవారని, తొలుత దాని అర్థం తెలియక పట్టించుకోలేదన్నాడు. అయితే హిందీలో నల్లగా ఉన్నవారిని కలు అని పిలుస్తారని తెలుసుకొని తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.

నాకైతే తెలియదు..
అయితే 2013,14 సీజన్లలో తనతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఇతర ఆటగాళ్లు మాత్రం భిన్న వ్యాఖ్యలు చేశారు. 2013 సీజన్‌లో హైదరాబాద్ తరఫున ఆడిన పార్ధీవ్ పటేల్ అలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలు తాను వినలేదని స్పష్టం చేశాడు. ‘అలాంటి విద్వేశపూరితమైన వ్యాఖ్యలను నేను మాత్రం వినలేదు'అని టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ పార్థీవ్ పటేల్ అన్నాడు. ఇక 2014 సీజన్‌లో అదే జట్టుకు ఆడిన, ప్రస్తుత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ వేణు గోపాల్ రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘విద్వేశపూరిత వ్యాఖ్యలపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఖచ్చితంగా చెప్పలేను కూడా'అని బదులిచ్చాడు.

ప్రజలకు అవగాహన కల్పించాలి..
2014 సీజన్‌లో సామీతో కలిసి ఆడిన భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఐపీఎల్‌లో వర్ణ వివక్ష వ్యాఖ్యలపై తనకు అవగాహన లేదన్నాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం ఇలాంటి ఘటనలు అనేకమని, ముఖ్యంగా సౌతిండియన్ క్రికెటర్లు ఇలాంటి వివక్ష ఎదుర్కొంటారని తెలిపాడు. ఈ వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డాడు.
యువరాజ్ సింగ్.. చావునైనా లెక్కచేయని ఫైటర్: లక్ష్మణ్

సౌతిండియన్ క్రికెటర్లపై వివక్ష..
‘2014 సీజన్‌లో నేను సామితోనే ఉన్నా. అయితే అతను అన్నట్లు జరిగితే మాత్రం ఆ వ్యవహారంపై తప్పకుండా చర్చించాలి. నాకైతే ఆ వ్యాఖ్యల గురించి తెలియదు. తెలియనప్పుడు మనం దానికి గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం. కానీ ఈ వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ఈ వర్ణ వివక్షను నేను చాలా చూశా. ముఖ్యంగా సౌతిండియన్ క్రికెటర్లు.. నార్త్, వెస్ట్ ఆటగాళ్ల నుంచి ఈరకమైన వివక్షను ఎదుర్కొంటారు. నేను ఎవరి పేరును ప్రస్తావించాలనుకోవడం లేదు. సరదాగా మాట్లాడుతూనే ఒకరిని తక్కువగా చేస్తూ హద్దులు దాటి కామెంట్ చేయడం ద్వారా హీరో కావాలనుకుంటారు.'అని పఠాన్ తెలిపాడు.
ధోనీ మాస్టర్ మైండ్.. వివాదాస్పద రీతిలో ఇయాన్ బెల్ రనౌట్! మహీని కొనియాడిన బ్రిటీష్ మీడియా!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications