న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: రావాలి రాహుల్.. కావాలి శుభ్‌మన్ గిల్: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar says India should begin Boxing Day Test against Australia on a positive note
India vs Australia : KL Rahul should Replace Prithvi Shaw as an Opener

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్‌లో ఎదురైన ఘోర పరాజయాన్ని నుంచి టీమిండియా తొందర బయటపడాలని, రెండో టెస్ట్‌లో ధీటుగా బదులివ్వాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. లేకుంటే ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌కు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించాడు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీషాను పక్కనపెట్టేసి కేఎల్ రాహుల్‌ను ఓపెనర్ ఆడించాలని, అలాగే శుభ్‌మన్ గిల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపించాలని సూచించాడు. ఇక ఆస్ట్రేలియాతో శనివారం ముగిసిన పింక్ టెస్టులో కోహ్లీసేన 8 వికెట్లతో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదు చేసింది. ఈ ఘోరపరాజయంపై స్పందించిన గవాస్కర్ పలు ఆస్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత ఆటగాళ్ల తప్పులేదు..

భారత ఆటగాళ్ల తప్పులేదు..

భారత ఆటగాళ్లను నిందించాల్సి పనిలేదన్నాడు. ఆస్ట్రేలియా పేసర్లు చూపిన జోరుకు భారత జట్టే కాకుండా ఏ జట్టు అయినా ఇలానే చిత్తయ్యేదని అభిప్రాయపడ్డాడు. ‘ఒక టీమ్ తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తక్కువ స్కోర్‌కు ఆలౌటైందంటే చాలా బాధగా ఉంటుంది. భారత్‌నే కాదు ఆ ప్లేస్‌లో ఇంకో టీమ్ ఉన్న అలానే అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆసీస్ బౌలింగ్ అటాక్ ముందు ఎలాంటి టీమ్ అయినా ఔటవ్వాల్సిందే. 36కే ఆలౌటవ్వకపోయినా ఇంకొన్న రన్స్ ఎక్కువ చేస్తుందంటే. హేజిల్ వుడ్, కమిన్స్‌తో పాటు స్కార్క్ సవాల్ విసిరాడు. అందువల్ల భారత ఆటగాళ్లను నిందించాల్సిన పనిలేదు.

క్లీన్ స్వీప్ అవుతారు..

క్లీన్ స్వీప్ అవుతారు..

ఇక మెల్‌బోర్న్‌ టెస్టును భారత్‌ గొప్పగా ఆరంభించాలి. సానుకూల ఆలోచన ధోరణితో మైదానంలో అడుగుపెట్టాలి. అలా చేయకపోతే టెస్టు సిరీస్‌ను 0-4తో కోల్పోయే ప్రమాదం ఉంది. పాజిటివ్ థింకింగ్‌తో బరిలోకి దిగితే టీమిండియా తప్పక రాణిస్తుంది. తొలి టెస్టు ప్రదర్శన తర్వాత కోపం రావొచ్చు. అయితే క్రికెట్‌లో ఏమైనా జరగవచ్చు. శుక్రవారం, శనివారం రోజు జరిగిన ఆటను గమనించండి. పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి

 ఆసీస్ బలహీనతపై దెబ్బకొట్టాలి..

ఆసీస్ బలహీనతపై దెబ్బకొట్టాలి..

ఆస్ట్రేలియా బలహీనత వాళ్ల బ్యాటింగ్‌. దానిపై దెబ్బకొట్టాలి. ఫీల్డింగ్‌లో చురుకుగా ఉండి, క్యాచ్‌లను అందుకోవాలి. తొలి టెస్టులో లబుషేన్‌, టిమ్‌ పైన్ ఆదిలోనే వెనుదిరిగేవారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు దాదాపు 120 పరుగుల ఆధిక్యం లభించేది. కానీ క్యాచ్‌లను జారవిడవడంతో ఆధిక్యం 50 పరుగులకే పరిమితమైంది. అయితే భారత తుదిజట్టులో రెండు మార్పులు అవసరం. పృథ్వీ షా స్థానంలో కేఎల్ రాహుల్ రావాలి. అలాగే శుభ్‌మన్‌ గిల్‌కు కూడా చోటు దక్కాలి. అతడు ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి. గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆరంభం గొప్పగా ఉంటే పైచేయి సాధించగలం.

షమీ లేకపోవడం లోటే..

షమీ లేకపోవడం లోటే..

‘మహ్మద్ షమీ గాయం భారత్‌ను ఇబ్బంది పెట్టే విషయమే. అతను బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు. అతను లేకపోవడం భారత జట్టుకు సమస్యే. అయితే ఇషాంత్‌ శర్మ ఫిట్‌గా ఉంటే వెంటనే అతన్ని ఆస్ట్రేలియాకు పంపించాలి. అలాగే టీమిండియా బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి. నవదీప్‌ సైనీ మంచి బౌలరే. కానీ వార్మప్‌ మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ తీరుని చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేడనిపిస్తోంది'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. 96 ఏళ్ల టెస్ట్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. ఎక్స్‌ట్రాలు కూడా సింగిల్ డిజిటే!

Story first published: Sunday, December 20, 2020, 18:37 [IST]
Other articles published on Dec 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X